ముద్రగడ బాటలోనే కొణతాల?

విశాఖ కు మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? మంచే చేస్తున్నామని వైసీపీ నేతలు సహజంగానే అంటారు. కానీ చెడు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తారు. ఇంతకీ [more]

Update: 2020-12-01 15:30 GMT

విశాఖ కు మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? మంచే చేస్తున్నామని వైసీపీ నేతలు సహజంగానే అంటారు. కానీ చెడు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తారు. ఇంతకీ విశాఖకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగిందా? లేదా? అని చెప్పాలంటే ఆ పెద్దాయన రావాల్సిందే. కానీ ఆయన ఇప్పుడు చెప్పే మూడ్ లో లేరు. అలాగని పూర్తిగా రాజకీయాలను వదిలేయలేదు. ఆయన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ.

ఎన్నికలకు ముందు…..

ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణకు ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాల్లో నిజాయితీగా ఉంటారంటారు. విలువను పాటిస్తారంటారు. గత పదేళ్ల నుంచి కొణతాల రామకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కొంత కన్పించి పదిహేను నెలలుగా కన్పించడమే మానేశారు. ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. తనపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని జగన్ ను కోరారు. కానీ అది కుదరకపోవడంతో వెంటనే ఆయన టీడీపీకి మద్దతు పలికారు.

జగన్ గురించి తెలిసి…..

గత ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ పోటీ చేయకపోయినా టీడీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కానీ టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో కొణతాల రామకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొణతాల రామకృష్ణకు జగన్ గురించి పూర్తిగా తెలుసు. జగన్ ను దగ్గరి నుంచి గమనించిన వారిలో కొణతాల రామకృష్ణ ఒకరు. అందుకే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారంటున్నారు.

ఇప్పుడు పూర్తిగా……

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొణతాల రామకృష్ణ అనేక ఉద్యమాలు చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం పోరాడారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం తరచూ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. విశాఖ రైల్వే జోన్ కోసం కూడా కొణతాల రామకృష్ణ ఉద్యమించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి నేతల్లాగానే ఈయన కూడా కామ్ అయిపోయారు. ముద్రగడ ఎలా కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకున్నారో? కొణతాల రామకృష్ణ కూడా ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని పక్కన పెట్టేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News