పార్టీకి భారంగా మారారా? రీజన్ బ్రదర్ అట

ఆయ‌న నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు రాజ‌కీయ నేత‌. వివాదాల‌కు అత్యంత దూరం. పార్టీ ప‌ట్ల విధేయ‌త విష‌యంలో ఆయ‌నను మించి.. లేర‌నే టాక్‌. ఆయ‌నే కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం పార్లమెంటు [more]

Update: 2020-06-06 11:00 GMT

ఆయ‌న నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు రాజ‌కీయ నేత‌. వివాదాల‌కు అత్యంత దూరం. పార్టీ ప‌ట్ల విధేయ‌త విష‌యంలో ఆయ‌నను మించి.. లేర‌నే టాక్‌. ఆయ‌నే కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం పార్లమెంటు స్థానం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు. అయితే, ఎంత నిరాడంబ‌రంగా ఉన్నా. ఎంత వివాదర‌హితంగా ఉన్నప్పటికీ.. ఎదుగుద‌ల విష‌యంలో ఆయ‌న వేసిన అడుగులు.. తీసుకున్న నిర్ణయాలు ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి. దీంతో అటు పార్టీకి ఆయ‌న‌.. పార్టీ ఆయ‌న‌కు కూడా భారంగా మారిపోయాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

కుమారుడి కోసం….

2009, 2014 ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి విజ‌యం సాధించిన టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. పార్లమెంటు ప్యానెల్ స్పీక‌ర్‌గా.. వివిధ క‌మిటీల‌కు చైర్మన్‌గా కూడా ఆయ‌న వ్యవ‌హ‌రించారు. అదేస‌మ‌యంలో పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా కూడా గుర్తింపు పొందారు. అయితే, గ‌త ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి ఆయన త‌న కుమారుడు కొన‌క‌ళ్ల కిర‌ణ్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఆశ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న వేసిన అడుగులు పార్టీలో నేత‌ల‌తో అంత‌ర్గత విభేదాల‌కు దారితీసేలా చేసింది. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు.

సోదరుడు చక్రం తిప్పడంతో….

దీంతో అక్క‌డ నాయ‌కుడు కాగిత వెంక‌ట్రావుతో లోపాయికారీ వివాదం ఏర్పడింది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్రతోనూ విభేదాలు పెంచుకున్నారు. దీంతో పార్టీలో గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యానికి ఒంటరి అయిపోయారు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. వాస్తవానికి తాను ఎంపీ టికెట్‌ను వ‌దులుకుంటాన‌ని, త‌న కుమారుడికి పెడన టికెట్ ఇవ్వాల‌ని కూడా కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. అయినా కూడా చంద్రబాబు ఆయ‌న ఆశ నెర‌వేర్చలేదు. పైగా.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి పాలయ్యారు. అప్పటికే రెండు సార్లు గెలిపించినా.. ఆయ‌న ఎంత నిదాన‌స్తుడు అయినా.. ఆయ‌న సోద‌రుడు బుల్లయ్య చ‌క్రం తిప్పడాన్ని నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు హ‌ర్షించ‌లేక పోయారు.

అవకాశం లేకుంటే….?

మొత్తంగా చూసుకుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో సోద‌రుడు బుల్లయ్య వ్యవ‌హార శైలి కార‌ణంగా కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ ప్రజ‌లకు దూర‌మ‌య్యారు. ఇక‌, త‌న కుమారుడికి టికెట్ కోసం.. పార్టీలోని త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులకే ఆయ‌న దూర‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు త‌న కుమారుడిని ఎలా రాజ‌కీయాల్లోకి తీసుకురా వా‌ల‌నే అంశంపై కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ త‌ల‌ప‌ట్టుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ ఫ్యామిలీకి బంద‌రులో ప‌ట్టున్నా అక్కడ సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ఆ కుటుంబానికి సీటు వ‌చ్చేలా లేవు. ఇక పెడ‌న‌లో కాగిత వెంక‌ట్రావు వార‌సుడు లైన్లోనే ఉన్నాడు. మొత్తంగా కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ మాత్రం త‌న కుమారుడి కోసం ఏం చేయాల‌నే ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. ద‌శాబ్దం పాటు ఎంపీగా ఉన్నా పార్టీని విడిచి పెట్టలేక‌.. త‌న త‌న‌యుడికి స‌రైన వేదిక చూపించ‌లేక స‌త‌మ‌త మ‌వుతున్నార‌ట‌. మ‌రి రాబోయే రోజుల్లో ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News