క‌థ కంచికేనటగా

చెర‌ప‌కురా చెడేవు! అనేది సామెత‌. కానీ, ఆ టీడీపీ నేత రాజ‌కీయాల్లో ఇది అక్షర స‌త్యంగా మారింది. త‌న హ‌వా కోసం, త‌న కుమారుడి ఫ్యూచ‌ర్ కోసం [more]

Update: 2019-08-23 00:30 GMT

చెర‌ప‌కురా చెడేవు! అనేది సామెత‌. కానీ, ఆ టీడీపీ నేత రాజ‌కీయాల్లో ఇది అక్షర స‌త్యంగా మారింది. త‌న హ‌వా కోసం, త‌న కుమారుడి ఫ్యూచ‌ర్ కోసం సొంత పార్టీ నేతకు పొగ‌పెట్టిన స‌ద‌రు నాయ‌కుడు ఇప్పుడు త‌న ఇంటికే మంట పెట్టుకున్న ప‌రిస్థితిని తెచ్చుకున్నారు. దీంతో ఏకంగా ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యమే ప్రశ్నా ర్థకంగా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే..కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించిన ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌. సౌమ్యుడు, వివాద ర‌హితుడిగా, డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ఉండే ఆయ‌న రాజ‌కీయంగా వేసిన అడుగులు ఇప్పుడు ఆయ‌న ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

హ్యాట్రిక్ కొడతారనుకుంటే…..

2009లో అప్పటి సిట్టింగ్ ఎంపీ బాడిగ రామ‌కృష్ణను, 2014లో అప్పటి సిట్టింగ్ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసార‌థిని కూడా ఓడించి 70 వేల మెజారిటీతో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన కొన‌క‌ళ్ల నారాయణ తాజాగా జ‌రిగిన పార్లమెంటు ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాచాటి వ‌రుస విజ‌యం సాధించాల‌ని భావించారు. కొన‌కళ్ల నారాయణకు హ్యాట్రిక్‌కు విజ‌యం ఖాయ‌మ‌ని టీడీపీ వ‌ర్గాలు కూడా భావించాయి. అయితే, ఆయ‌న త‌న కుమారుడిని కూడా రంగంలోకి దింపాల‌ని ప్రయ‌త్నం చేశారు. త‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదు కాబ‌ట్టి త‌న క‌మారుడికి పెడ‌న నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.

పెడన టిక్కెట్ అడిగినా….

ఈ క్రమంలో అక్కడ ఉన్న సొంత పార్టీ నాయ‌కుడు కాగిత వెంక‌ట్రావును తీవ్రంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాల‌కు కొన‌కళ్ల నారాయణ తెర‌దీశారు. వాస్తవంగా చూస్తే కాగిత వెంక‌ట్రావు పార్టీలో చాలా సీనియ‌ర్‌. ఆయ‌న్ను చివ‌ర్లో కొన‌క‌ళ్ల వ‌ర్గం తీవ్రంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయ‌త్నాలు చేసింది. అయితే, చంద్రబాబు మాత్రం పెడ‌న టికెట్‌ను కాగిత వెంక‌ట్రావు కుమారుడికే కేటాయించారు. ఇక‌, మ‌చిలీప‌ట్నం నుంచి కొన‌క‌ళ్లకు టికెట్ ఇచ్చారు. అయితే, అటు కుమారుడికి టికెట్ ఇప్పించుకోవ‌డంలో విఫ‌ల‌మైన కొన‌క‌ళ్ల తాను కూడా వ‌ల్లభ‌నేని బాల‌శౌరి చేతిలో తాజా ఎన్నిక‌ల‌లో ఓట‌మిపాల‌య్యారు.

ఫ్యూచర్ ఉన్నట్లేనా…?

ఈ నేప‌థ్యంలో ఇక‌, ఫ్యూచ‌ర్ లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఓడిపోయిన త‌ర్వాత కొన‌కళ్ల నారాయణఇప్పటి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున ఏ కార్యక్రమంలోను పాల్గొనడం లేదు. నిన్నటికినిన్న చంద్రబాబు జిల్లాలో ప‌ర్యటించి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన స‌మయంలో కూడా కొన‌క‌ళ్ల రాలేదు. చంద్రబాబు ప‌ర్యట‌న అంతా కొన‌క‌ళ్ల ప‌రిధిలోని పెన‌మ‌లూరు, పామ‌ర్రు, అవనిగ‌డ్డ, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కొన‌సాగింది. అయితే కొన‌క‌ళ్ల మాత్రం త‌న‌కు స‌మాచారం లేద‌ని డుమ్మా కొట్టిన‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టి ఇక‌, కొన‌క‌ళ్ల రాజకీయ ప్రస్థానం ముగిసింద‌నే వార్తల‌కు బ‌లం చేకూరింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News