కోన ర‌ఘుప‌తి రికార్డ్ తిర‌గ‌రాస్తారా ?

కోన రఘుప‌తి. ఏపీ అసెంబ్లీ డిఫ్యూటీ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోన [more]

Update: 2019-06-23 16:30 GMT

కోన రఘుప‌తి. ఏపీ అసెంబ్లీ డిఫ్యూటీ స్పీక‌ర్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోన కుటుంబానికి సుధీర్ఘ‌మైన రాజ‌కీయ ప్ర‌స్థానం ఉంది. కోన రఘుప‌తి తండ్రి కోన ప్ర‌భాక‌ర‌రావు కూడా రాజ‌కీయాలు చేశారు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో కొన‌సాగి, వాటికి వ‌న్నెతెచ్చారు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ ర‌ఘుప‌తిపైనే కేంద్రీ కృత‌మైంది. త‌న తండ్రి వార‌స‌త్వాన్ని, సంప్ర‌దాయాన్ని ర‌ఘుప‌తి ఏమేర‌కు నిల‌బెడ‌తారు? చ‌ట్ట‌స‌భ‌ల గౌర‌వాన్ని ఏ విధంగా ఇనుమ‌డింప‌జేస్తారు? అని ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచిస్తున్నారు.

కాంగ్రెస్ లో ప్రారంభ‌మైన కోన రఘుప‌తి రాజ‌కీయం.. వైఎస్‌ అండ‌దండ‌ల‌తో ముందుకు సాగింది. గుంటూరు జిల్లా బాప‌ట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. వాస్త‌వానికి 2009 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న‌కు సీటు ఇవ్వాల్సి ఉన్నా అప్ప‌ట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ నేత గాదె వెంక‌ట‌రెడ్డిని త‌ప్పించేందుకు సోనియాగాంధీ ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు సీటు రాలేదు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల పైచిలుకు ఓట్లు రాబ‌ట్టుకోవ‌డం విశేషం.

బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన కోన రఘుప‌తి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన స‌మయంలో సంఘీభావంగా కోన కొన్ని కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసి.. జ‌గ‌న్ విశ్వాసాన్ని చూర‌గొన్నారు. నిబ‌ద్ధ‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌ల‌కు పెట్ట‌ని కోట‌గా మారారు. అన్నింటికి మించి ర‌ఘుప‌తి తండ్రి ప్ర‌భాక‌ర్‌రావు మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీకి అత్యంత స‌న్నిహితుడు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌ణ‌బ్‌కు మ‌ద్ద‌తు ఇచ్చినా… జ‌గ‌న్‌కు రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్లు కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వాస్త‌వానికి 2017-18 మ‌ధ్య కాలంలో రాష్ట్రంలో వైసీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎక్క‌డిక‌క్క‌డ వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ త‌న పార్టీలోకి చేర్చుకుంది.

ఈ క్ర‌మంలోనే ర‌ఘుప‌తిని కూడా పార్టీలోకి చేర్చ‌కునే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఒక సంద‌ర్భంలో ర‌ఘుప‌తి స్వయంగా మీడియా ముందు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. తాను జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస పాత్రుడుగానే ఉండాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ కోసం, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. క‌ట్ చేస్తే తాజా ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. వ‌చ్చిన వెంట‌నే త‌న‌కు విశ్వాస‌పాత్రులుగా ఉన్న వారికి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌డంపై దృష్టి పెట్టారు. ఆర్భాటాల‌కు పోకుండా తాను చేయాల్సింది చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడిగా పేరు తెచ్చుకున్న జ‌గ‌న్ కోన రఘుప‌తికి.. డిఫ్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘుప‌తిపై చాలానే బాధ్య‌త ఉంద‌ని రాజ‌కీయ మేథావులు సూచిస్తున్నారు. వైసీపీ నాయ‌కులు డిఫ్యూటీ స్పీక‌ర్ హోదాలో స‌భ‌ను న‌డిపించ‌డం ద్వారా గతంలో త‌న తండ్రి ప్ర‌భాక‌రరావు నెల‌కొల్పిన సంప్ర‌దాయాల‌ను కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల్సిన అవ‌స‌రం కూడా నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కోన రఘుప‌తి ఏ విధంగా ముందుకు సాగుతారు. జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని ఏమేర‌కు ప్ర‌తిఫ‌లించేలా కృషి చేస్తార‌నేది చూడాలి. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న ర‌ఘుప‌తికి ఐదేళ్ల‌లో చూపించే పెర్పామెన్సే 2024లో ఆయ‌న హ్యాట్రిక్ విజ‌యానికి కూడా గీటురాయి అవ్వొచ్చు. ఈ క్ర‌మంలో ఒక‌ప‌క్క స‌భా నిర్వ‌హ‌ణ‌, మ‌రోప‌క్క నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి వంటివ ఆయ‌న ముందు ఉన్న ప్ర‌ధాన స‌వాళ్లు. వీటిని ఏ విధంగా నిర్వ‌ర్తిస్తారో చూడాలి.

Tags:    

Similar News