పెద్ద చిక్కొచ్చిపడిందే?

కాంగ్రెస్ లో శత్రుత్వం మామూలుగా ఉండదు. పార్టీ అధికారంలో లేకపోయినా కలసి నడవడానికి నేతలు ఇష్టపడరు. తన ఉన్నతి అడ్డు వస్తారన్న అనుమానంతో నిత్యం వైరంతోనే ఉంటారు. [more]

Update: 2020-10-28 11:00 GMT

కాంగ్రెస్ లో శత్రుత్వం మామూలుగా ఉండదు. పార్టీ అధికారంలో లేకపోయినా కలసి నడవడానికి నేతలు ఇష్టపడరు. తన ఉన్నతి అడ్డు వస్తారన్న అనుమానంతో నిత్యం వైరంతోనే ఉంటారు. అది కాంగ్రెస్ లోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి అలాగే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కు నమ్మకైన నేత. ఆయన పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు కూడా. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అనేకసార్లు ఆయన చెప్పుకున్నారు.

కాంగ్రెస్ కార్యక్రమాల్లో…..

ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోరుగా పాల్గొంటున్నారు. ఆయన తన అనుచరులతో కలసి మరీ ప్రచారం లో పాల్గొంటున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక సమస్య వచ్చి పడింది. ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయనను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గగొండ పార్లమెంటు పరిధిలో ఉంది.

నల్లగొండకు వెళ్లాలంటే…..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటికి ఆయన నాలుగు సార్ల నుంచి నల్లగొండ నుంచి గెలుస్తూ వస్తున్నారు. తన కంచుకోటలో ఓటమి పాలవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాణమంతా నల్లగొండపైనే ఉంది.

ప్రొటోకాల్ సమస్య…..

కానీ నల్లగొండ కు ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన తన పాత నియోజకవర్గంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇరవై ఏళ్లుగా సన్నిహితులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తాము నమ్ముకున్న నేత పట్టించుకోవడం లేదన్న విమర్శలు చేస్తున్నారు. నల్లగొండ లో టీఆర్ఎస్ గెలవడంతో అక్కడ చిన్నా చితకా పనులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కాకపోవడంతో అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు చూస్తున్నారు. ఆయన మాత్రం ఉత్తమ్ నియోజకవర్గంలోకి రావడం బాగుండదని ఆగిపోతున్నారు. అయితే దసరా పండగ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండకు వస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News