Kodela : అక్కడి నుంచి తప్పించేయడం గ్యారంటీ అట

వారసత్వ రాజకీయాలు అంత సులువు కాదు. అనేక మంది వారసులు తమ తల్లిదండ్రుల తర్వాత రాజకీయంగా దూరమయ్యారనే చెప్పాలి. ఎంత ప్రయత్నించినా వారికి పాలిటిక్స్ వర్క్ అవుట్ [more]

Update: 2021-11-03 15:30 GMT

వారసత్వ రాజకీయాలు అంత సులువు కాదు. అనేక మంది వారసులు తమ తల్లిదండ్రుల తర్వాత రాజకీయంగా దూరమయ్యారనే చెప్పాలి. ఎంత ప్రయత్నించినా వారికి పాలిటిక్స్ వర్క్ అవుట్ కాదు. అందులో కోడెల శివరాం ఒకరు. ఆయనకు పాలిటిక్స్ అచ్చొచ్చినట్లు కన్పిచడం లేదు. తండ్రి మరణం తర్వాత సానుభూతి కూడా ఆయనకు లభించడం లేదు. ప్రజలను సంగతి పక్కన పెడితే కోడెల శివరాంక సొంత పార్టీలోనే సానుభూతి కొరవడటం ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటో చెప్పకనే తెలుస్తోంది.

ఎంత ప్రయత్నిస్తున్నా….

కోడెల శివరాం కొన్ని దశాబ్దాల పాటు గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవికి ఆయన పేరే వినపడేది. మంత్రిగా, చివరిగా స్పీకర్ గా కోడెల శివప్రసాద్ రాష్ట్ర స్థాయి నేత అయ్యారు. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబంలో వారసత్వానికి రాజకీయాలు అచ్చిరానట్లే ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ ఛార్జి కోసం కోడెల శివరాం గత ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నారు.

లోకల్ గా వ్యతిరేకత….

కానీ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. తండ్రి స్పీకర్ గా ఉండగా సత్తెనపల్లి నియజకవర్గంలో సొంత పార్టీ నేతలకే ఆయన చుక్కలు చూపారు. కులాలు, మతాలకు అతీతంగా ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. కోడెల విగ్రహావిష్కరణ సొంత గ్రామంలో చేయాలన్నా ఆయనకు ఇబ్బందులొచ్చాయి. స్థానిక టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి రా‌ష్ట్రనేతలెవ్వరూ రావద్దని బహిరంగంగానే హెచ్చరించారు. తర్వాత పార్టీ నాయకత్వం జోక్యంతో విగ్రహావిష్కరణ జరిగింది.

టిక్కెట్ ఇచ్చినా…?

ఇలాంటి పరిస్థితుల్లో కోడెల శివరాం రాజకీయ భవిష‌్యత్ ఏంటన్నది పార్టీలో చర్చ నడుస్తుంది. సత్తెన పల్లి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆయనకు సీటు ఇస్తే కష్టమన్నది చంద్రబాబు భావన. అలాగని కోడెల కుటుంబాన్ని పార్టీ నుంచి దూరం చేసే అవకాశం లేదు. దీంతో కోడెల శివరాంకు పార్టీలో కీలక పదవి అప్పగించి, భవిష‌్యత్ లో అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. అదే జరిగితే కోడెల శివరాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది.

Tags:    

Similar News