వారిని వదిలేయండి

ప‌ల్నాడులో టీడీపీ రాజ‌కీయం ఏమైంది? గ‌త ఐదేళ్ల కాలంలో ప్రజల్లో పేరున్న నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీలో పులిగా.. సింహంగా మ‌సిలిన [more]

Update: 2019-09-19 02:00 GMT

ప‌ల్నాడులో టీడీపీ రాజ‌కీయం ఏమైంది? గ‌త ఐదేళ్ల కాలంలో ప్రజల్లో పేరున్న నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీలో పులిగా.. సింహంగా మ‌సిలిన వారు.. ఇప్పుడు కనుమరుగవుతున్నారు. కోడెల ఆత్మహత్య అందుకు ఉదాహరణ. విష‌యంలోకి వెళ్తే.. ప‌ల్నాడు ప్రాంతంలోని గుర‌జాల‌, స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌సారావుపేట‌ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావులు గ‌ట్టిగానే ఇక్క‌డ రాజ‌కీయాలు చేశారు.

పల్నాటి పులి అంటూ…..

ప్ర‌భుత్వంలో కాకుండా రాజ్యాంగ బ‌ద్ధంగా కీల‌క ప‌ద‌విని సంపాయించుకున్న కోడెల ప‌ల్నాటి పులి మా దిరిగా, య‌ర‌ప‌తినేని ప‌ల్నాటి సింహం మాదిరిగా చ‌లామ‌ణి అయ్యారు. రాజ‌కీయాలు చేశారు. ఒక‌రు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతూనే వివాదాల్లో కూరుకుపోగా.. మ‌రొక‌రు.. త‌మ కుటుంబస‌భ్యు ల కార‌ణంగా తీవ్ర వివాదాలను చవిచూడాల్సి వచ్చింది. అవమానాలను భరించలేక కోడెల ఆత్మహత్యచేసుకున్నారు. ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. యరప‌తినేని లేట‌రైట్ గ‌నుల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని, దాదాపు వందల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వానికి చెల్లించ కుండానే త‌న ఖాతాలో వేసుకున్నార‌ని కేసులు న‌మోద‌య్యాయి.

ఐదేళ్ల పాలనలో…..

ఐదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉండ‌డంతో గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో య‌ర‌ప‌తినేని హ‌వాకు తిరుగులేకుండా పోయింది. పిడుగురాళ్ల‌, మాచ‌వ‌రం మండ‌లాల్లో ఉన్న లేట‌రైట్ గ‌నుల్లో అక్ర‌మంగా త‌వ్వ‌కాలు జ‌రిపించేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చివ‌ర‌కు అక్ర‌మ మైనింగ్ విష‌యంలో ఆయ‌న‌పై సీబీఐ సైతం త్వ‌ర‌లోనే విచార‌ణ‌కు రెడీ అవుతోంది. ఏపీ ప్ర‌భుత్వం కూడా వీటిపై సీబీఐని వేసేందుకు రెడీ అయిన‌ట్టు కోర్టుకు తెలిపింది.ఇక‌, కోడెల కుటుంబానికి సంబంధించిన కేసులు భారీ ఎత్తున జిల్లాలో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని న‌ర‌సారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో కోడెల వార‌సులు చేసిన పనులపై అనేక ఆరోపణలు విన్పించాయి. ప్ర‌భుత్వం మారిన ఈ మూడు నెల‌ల్లో ఎన్ని కేసులు న‌మోద‌వుతున్నాయో ? చూస్తూనే ఉన్నాం. కోడెల కుమారుడు, కుమార్తె కూడా కేసుల్లో చిక్కుకున్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా.. ఫ‌లితం లేకుండా పోయింది.

ఇద్దరికీ సపోర్ట్ లేదు…..

ఇక‌, సాక్షాత్తూ కోడెల అసెంబ్లీ ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న‌ ఇంటికి త‌ర‌లించ‌డం ద్వారా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కోడెల తీరును చివ‌ర‌కు సొంత పార్టీ నేత‌లే త‌ప్పుప‌ట్టారు. ఐదేళ్ల పాటు అధికారం అండంతో ప‌ల్నాడు పులి, ప‌ల్నాడు సింహం బ్యానర్లతో ప‌ల్నాడులో జ‌రిగిన హంగామా అంతా ఇంతా కాదు. కోడెల ఆత్మహత్యతో ఒక కేసు ముగిసిపోయింది. ఇకనైనా టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించడం వదిలేయాలని టీడీపీ సీనియర్ నేతలు కోరుతున్నారు. మానసికంగా వేధిస్తే ఎంతటి ధైర్యవంతులైనాతట్టుకోలేరని కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఉదాహరణ అని వారు జగన్ సర్కార్ కు హితవు చెబుతున్నారు.

Tags:    

Similar News