ప్రొఫెసర్ చట్టసభల్లోకి అడుగుపెట్టేస్తారటగా

ప్రొఫెసర్ కల నెరవేరనుందా? ఆయన చట్ట సభల్లోకి అడుగుపెట్టే సమయం వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది ఖచ్చితంగా చట్ట సభలోకి [more]

Update: 2020-07-26 09:30 GMT

ప్రొఫెసర్ కల నెరవేరనుందా? ఆయన చట్ట సభల్లోకి అడుగుపెట్టే సమయం వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది ఖచ్చితంగా చట్ట సభలోకి అడుగుపెడతారని దాదాపు అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కోదండరామ్ గెలుపుఖాయమంటున్నాయి. ఆయన తొలిసారి బరిలోకి దిగే ఎన్నికల్లో సమాజం ఆయన వెన్నంటి నడుస్తుందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బలంగా విన్పిస్తున్నాయి. ఎందుకు? ఎలా? అంటే…?

కీలకభూమిక పోషించినా…..

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయనను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. నిజానికి కోదండరామ్ కు చట్టసభల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది. ఆయన రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ ఆ కల నెరవేరలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇప్పట్లో సాధమయ్యే పనికాదు. గత ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి కోదండరామ్ బరిలోకి దిగాలనుకున్నారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో……

అయితే ఇప్పుడు కోదండరామ్ కు అవకాశం దక్కింది. వచ్చే ఏడాది ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ఈ మూడు జిల్లాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ కు పట్టుంది. ఆయన అభిమానులు, ఆయనంటే ఇష్పపడే వారుఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో టీఆర్ఎస్ కు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కోదండరామ్ సిద్ధమయ్యారు. ఇప్పటి నుంచే ఆ ప్రాంత నాయకులతో టచ్ లో ఉంటున్నారు.

బలంగా ఉండటంతో….

మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ల నుంచి కూడా కోదండరామ్ కు మద్దతు లభిస్తుంది. టీఆర్ఎస్ ను ఓడించే లక్ష్యంతోనే ఈ పార్టీలన్నీ కోదండరామ్ వైపే మొగ్గు చూపుతాయి. మూడు జిల్లాల్లో వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ కు పట్టు ఉండటంతో ఈ ఎన్నికలో కోదండరామ్ విజయం తధ్యమని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పై ఉన్న అసంతృప్తి కూడా తనకు కలసి వస్తుందని కోదండరామ్ నమ్ముతున్నారు. మరి ప్రొఫెసర్ గారి ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News