రెండేళ్ల తర్వాత సారు సై అంటున్నారు

దాదాపు రెండేళ్ల నుంచి నిశ్శబ్బంగా ఉన్న వారి వాయిస్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ జన సమితి క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారాన్ని అనుకూలంగా [more]

Update: 2020-05-15 09:30 GMT

దాదాపు రెండేళ్ల నుంచి నిశ్శబ్బంగా ఉన్న వారి వాయిస్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ జన సమితి క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారాన్ని అనుకూలంగా మలచుకోవడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. దొరకక దొరకక దొరికిన ఛాన్స్ గా తెలంగాణలో పోతిరెడ్డి ప్రాజెక్టు విపక్షాలకు వరంగా మారిందనే చెప్పాలి. పోతిరెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో విపక్షాలకు ఊపిరినిచ్చిందనే చెప్పాలి.

పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో….

పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో 203 ను విడుదల చేసింది. దాదాపు ఎనభై వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణలో అలజడి రేపింది. పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయని విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఒకరకంగా కేసీఆర్ కు ఇబ్బంది తప్పదు.

విపక్షాలతో కలసి….

ఏపీ ప్రభుత్వం సామర్థ్యాన్ని పెంచుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని కోదండరామ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలతో కలసి ఉద్యమానికి సిద్ధం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించడం ఒకవైపు చేయడంతో పాటు పెద్దయెత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని కోదండరామ్ నిర్ణయించారు. కోదండరామ్ కు తెలంగాణ ప్రజల్లో మంచి పేరుంది. ప్రొఫెసర్ గా మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. కేసీఆర్ తో విభేదాలతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు.

కల్వకుర్తి తరహాలో….

గత ఎన్నికల్లో పోటీ చేసినా ప్రయోజనం లేకపోయింది. మహాకూటమి అభాసుపాలయింది. కేసీఆర్ ఉన్న ప్రజల్లో ఉన్న నమ్మకంతోనే విపక్షాలు తెలంగాణలో సోదిలో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు అంశాన్ని అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా కోదండరామ్ నేతృత్వంలోనే సమిష్టిగా కేసీఆర్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. 1990 లో కల్వకుర్తికోసం జరిగిన పోరాటం తరహాలోనే పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతానని కోదండరామ్ ప్రకటించారు. మొత్తం మీద రెండేళ్ల తర్వాత కోదండరామ్ తో పాటు విపక్షాలకు ఆయుధం దొరికినట్లయింది.

Tags:    

Similar News