సార్… సీరియస్ డెసిషన్..?

రాజకీయాల్లో ఆశలు ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి తీరతాయనుకుంటే పొరపాటే అవుతుంది. రాజకీయాల్లోనూ శ్రమతో పాటు లక్కు కూడా అంతే అవసరం. లక్కున్నోడే రాజకీయాల్లో రాణిస్తారనడానికి అనేక [more]

Update: 2019-11-21 09:30 GMT

రాజకీయాల్లో ఆశలు ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి తీరతాయనుకుంటే పొరపాటే అవుతుంది. రాజకీయాల్లోనూ శ్రమతో పాటు లక్కు కూడా అంతే అవసరం. లక్కున్నోడే రాజకీయాల్లో రాణిస్తారనడానికి అనేక ఉదాహరణలు మనకు కన్పిస్తాయి. మంచి పేరు, నిజాయితీ, నిబద్ధత లేవీ రాజకీయాల్లో పనికి రావని మరోసారి తేలిపోయింది. ఆయనే ప్రొఫెసర్ కోదండరామ్. నిజాయితీ గలిగిన ప్రొఫెసర్ గా, తెలంగాణ కోసం అందరినీ ఏకం చేసిన జేఏసీ ఛైర్మన్ గా ఆయన చేసిన కృషి ఎవరూ మరువలేనిది.

ఉద్యమ సమయంలో……

కానీ తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా దానిని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన కోదండరామ్ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఎటూ కాకుండా పోయారంటున్నారు. ఆయన జనాలను ఆకట్టుకోలేకపోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కోదండరామ్ తొలుత ఉద్యమనాయకుడిగానే ఉన్న తర్వాత కొత్త పార్టీని పెట్టారు. తెలంగాణ జనసమితిని స్థాపించి ప్రజల్లోకి దానిని సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయారు. గ్రామగ్రామనా పార్టీ క్యాడర్ ను కూడా కోదండరామ్ ఏర్పాటు చేసుకోలేకపోయారన్నది వాస్తవం.

సానుకూలత ఉన్నా….

నిజానికి కోదండరామ్ పట్ల తెలంగాణ మొత్తం మీద సానుకూల అభిప్రాయం ఉంది. ఆయనను ఏ విష‍యంలోనూ తప్పుపట్టేందుకు వీలుండదు. కానీ కోదండరామ్ తెలంగాణ జన సమితిని స్థాపించింది టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే. టీఆర్ఎస్ ఏకపక్ష రాజకీయాలకు ఆయన చెక్ పెడదామనుకున్నారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆయనకు కలసి రాలేదు. కోదండరామ్ అన్ని పార్టీల గడప తొక్కుతారన్న పేరు మాత్రం తెచ్చుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టినా టీడీపీతో జత కట్టడాన్ని ప్జలు కూడా తప్పుపట్టారు.

మూసేస్తారా? విలీనం చేస్తారా?

కోదండరామ్ ను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు సార్ అనే సంభోదిస్తారు. అయితే ఇప్పుడు తెలంగాణ జనసమితి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పార్టీని నడిపించడం కష్టంగానే ఉంది. కోదండరామ్ తప్ప మరో నేత పార్టీలో కన్పించడం లేదు. తెలంగాణ జనసమితి ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న నేతలు ఇప్పుడు కోదండరామ్ వెంట లేరు. కోదండరామ్ తరచూ బీజేపీ నేతలతో సమావేశం కావడాన్ని కూడా ఆయన సన్నిహితులే తప్పుపడుతున్నారు. దీంతో కోదండరామ్ త్వరలోనే పార్టీని మూసేయాలన్న నిర్ణయం కూడా తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేరే పార్టీలో విలీనం దిశగా కోదండరామ్ అడుగులు వేస్తున్నారంటున్నారు. మొత్తం మీద సార్ పెట్టిన పార్టీకి జనాదరణ లభించకపోవడంతోనే ఆయన సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News