క‌మ్మల‌ను కూడ‌గ‌ట్టే స‌త్తా కొడాలికి ఉందా..?

రాజ‌కీయాల్లో ప్రస్తుతం అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. అయితే, ప్రత్యేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వ‌ర్గం క‌మ్మల విష‌యం మాత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా చ‌ర్చకు [more]

Update: 2020-09-14 00:30 GMT

రాజ‌కీయాల్లో ప్రస్తుతం అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. అయితే, ప్రత్యేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వ‌ర్గం క‌మ్మల విష‌యం మాత్రం ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా చ‌ర్చకు దారితీస్తోంది. గ‌తంలో వైఎస్ హ‌యాంలో ఎప్పుడూ రెడ్డి సామాజిక వ‌ర్గం సెంట్రిక్‌గా రాజ‌కీయాలు న‌డ‌వ‌లేదు. పైగా ఆ సామాజిక వ‌ర్గంపై విమ‌ర్శలూ రాలేదు. కానీ.. అదేం చిత్రమో.. చంద్రబాబు విష‌యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి విమ‌ర్శలు, వివాదాలు తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. క‌మ్మ వ‌ర్గాన్ని చంద్రబాబు వాడుకోవ‌డం, ఆయ‌న ఎద‌గ‌డ‌మే త‌ప్ప.. ఆ సామాజిక వ‌ర్గానికి చేసిన మేలు లేద‌ని అనేవారు చాలా మంది ఉన్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు బాబుతో ఉండి బ‌య‌ట‌కు వ‌స్తోన్న వారే ఈ విమ‌ర్శలు చేస్తున్నారు.

కమ్మవర్గానికే చెందిన…..

ఒక వేళ చేసినా.. త‌న సామాజిక వ‌ర్గంలో త‌న వారు అనుకున్న వారికి మాత్రమే బాబు న్యాయం చేస్తార‌ని ప‌లువురు ఇప్పటికీ విమ‌ర్శిస్తారు. ఇక‌ గ‌తంలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. టీడీపీకి రాం రాం చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చారు. వైసీపీలో చేరి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి త‌ర్వాత క‌మ్మ వ‌ర్గం మ‌రింత‌గా బాబుపై అస‌హ‌నంతో ఉంది. టీడీపీలోనే చాలా మంది క‌మ్మ నాయ‌కులు బాబు వ్యవ‌హార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటివారిలో ఒక‌రు గన్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ. ఆయ‌న వెంట‌నే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. జ‌గ‌న్ చెంత చేరిపోయారు.

అందరినీ ఏకం చేస్తూ…..

ఆ వెంట‌నే చంద్రబాబే క‌మ్మల‌కు ప్రధాన శ‌త్రువు అంటూ కామెంట్లు కుమ్మరించారు. ఇక‌, ఇటీవ‌ల మంత్రి కొడాలి నాని టీడీపీలోని క‌మ్మల‌ను వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వంశీని పార్టీలోకి తీసుకువ‌చ్చారు. మ‌రో క‌మ్మ నేత చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిన‌ప్పుడు కూడా వంశీ లాంటి వాళ్లు ప‌క్కనే ఉన్నారు. ఇక చంద్రబాబును తిట్టాల్సి వ‌చ్చిన‌ప్పుడు నిన్నటి వ‌ర‌కు మంత్రి నాని ఒక్కరే ప్రెస్‌మీట్ పెట్టగా… ఇప్పుడు త‌న వ‌ర్గం ఎమ్మెల్యేలు అయిన వ‌ల్లభ‌నేని వంశీతో పాటు వ‌సంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్లను కూడా ప‌క్కన పెట్టుకుని మ‌రీ చంద్రబాబుపై విమ‌ర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఆయనే టాప్ లీడర్….

మ‌రోప‌క్క, జ‌గ‌న్ కూడా క‌మ్మల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక‌, ఇప్పుడు నాని.. కూడా ఈ ప్రయ‌త్నంలోనే క‌మ్మ వ‌ర్గాన్ని వైసీపీవైపు తీసుకువ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అవ‌కాశం వ‌చ్చినప్ర‌తిసారీ టీడీపీపైనా, చంద్రబాబుపైనా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ దూకుడు క‌మ్మల‌ను ఏమేర‌కు ఆక‌ర్షిస్తుంద‌నేది ప్రశ్నార్థకంగా మారింది. కొడాలి నాని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వైసీపీ క‌మ్మ నాయ‌కుల్లో టాప్ లీడ‌ర్ అన్న విష‌యంలో డౌట్ లేదు. అయితే నాని దూకుడు చాలా మందికి ఆయ‌న్ను దూరం చేసింది.

బాబును కాదని….

ఈ నేప‌థ్యంలో ఆయ‌న క‌మ్మల విష‌యంలో ఆక‌ర్షణ మంత్రం ఏమేర‌కు ప‌నిచేస్తుంద‌నేది చూడాలి. ఇటు వైసీపీలోని క‌మ్మల‌ను, అటు టీడీపీలోని క‌మ్మల‌ను కూడా ఏక‌తాటిపైకి తెచ్చి.. రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తే.. వీరికి కొడాలి నానీనే నాయ‌కుడు అవుతార‌న‌డంలో సందేహం లేదు. అయితే, బాబును కాద‌ని, కొడాలి వెంట న‌డిచేవారు ఎంద‌రో చూడాలి.

Tags:    

Similar News