నందమూరితో బంధాలు తెగిపోయినట్లేనా ?

నందమూరి కుటుంబం అంటే ప్రాణం పెట్టే వారు ఏపీ నిండా ఉన్నారు. వారికి చంద్రబాబు కంటే కూడా ఎన్టీయార్ బ్లడ్ చాలా ముఖ్యం. అటువంటి వారిలో అగ్ర [more]

Update: 2021-01-08 05:00 GMT

నందమూరి కుటుంబం అంటే ప్రాణం పెట్టే వారు ఏపీ నిండా ఉన్నారు. వారికి చంద్రబాబు కంటే కూడా ఎన్టీయార్ బ్లడ్ చాలా ముఖ్యం. అటువంటి వారిలో అగ్ర తాంబూలం ప్రస్తుత వైసీపీ మంత్రి కొడాలి నానిదే అని చెప్పాలి. ఆయనకు నందమూరి ఫ్యామిలీతో ఉన్న బంధం చాలా గొప్పది. హరికృష్ణ వెన్నంటి ఉండే కొడాలి నానికి ఆయన తనయుడు జూనియర్ ఎన్టీయార్ తో కూడా సోదర సమానమైన ప్రేమ ఉంది. ఇంతలా పెనవేసుకుపోయిన ఈ బంధానికి ఇపుడు బీటలు పడినట్లుగా చెబుతున్నారు.

హరితోనే అలా …

హరిక్రిష్ణ మరణించి ఇప్పటికి రెండున్నరేళ్ళు అయింది. ఆయన ఉన్నపుడు అంతా సాఫీగా సాగిన వ్యవహారం ఇపుడు అడ్డం తిరిగింది అంటున్నారు. హరికి తోడు నీడగా ఉండే కొడాలి నాని ఆయన మరణాంతరం జూనియర్ తో కూడా గతంలోలా రిలేషన్స్ మెయింటెయిన్ చేయడంలేదని చెబుతున్నారు. ఇక జూనియర్ సైతం కొడాలి నాని పట్ల మునుపటి ప్రేమాభిమానాలను చూపడంలేదని అంటున్నారు. కొడాలి నాని బోల్డ్ గా మాట్లాడడమే కాకుండా వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రిగా కొనసాగుతూండడంతో తనకు తన ఇమేజ్ కి అది డ్యామేజ్ అని తలచే జూనియర్ కొడాలి నానితో దూరం పాటిస్తున్నారు అన్నది ఒక టాక్.

బాలయ్య సైతం …

ఇక గతంలో టీడీపీ సారధ్యాన్ని జూనియర్ అయినా బాలయ్య అయినా చేపట్టాలి అని కొడాలి నాని లాంటి వారు తరచూ అనేవారు. వైసీపీలో మంత్రిగా జగన్ కి అత్యంత సన్నిహితుడిగా నాని మారాక నందమూరి ఫ్యామిలీ కూడా ఆయన మీద గుస్సా అవుతోంది అంటున్నారు. అందుకే తాజాగా బాలయ్య కొడాలి నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మాటలు ఉండవు చేతల్లో జవాబు చెబుతామని బాలయ్య కొడాలి నానిని ఉద్దేశించి అనడం వెనక ఆయన్ని జగన్ మనిషిగా వైసీపీ నేతగా కలిపి కట్టేసిన సందేశం దాగి ఉందని అంటున్నారు.

జగనే సీఎం…..

ఇక కొడాలి నాని కూడా ఈ మధ్య తరచూ చేస్తున్న కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. జగనే ఏపీకి సుదీర్ఘ కాలం సీఎం. మరో నేతకు అసలు చాన్స్ లేదు అని కొడాలి నాని జోస్యం చెబుతున్నారు. టీడీపీ పని అయిపోయిందని కూడా కొడాలి నాని గట్టిగానే అంటున్నారు. జూనియర్ వచ్చినా మరెవరు వచ్చినా కూడా టీడీపీని నిలబెట్టలేరు అని ఆ మధ్యన కొడాలి నాని నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మొత్తానికి చూస్తే నానికి నందమూరి వారికి మధ్య ఎనలేని దూరం పెరిగింది అంటున్నారు. నాని కమ్మల పార్టీగా ఉన్న టీడీపీని దారుణంగా అటాక్ చేయడం కూడా నందమూరి వారి ఆగ్రహానికి మరో ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. చూడాలి ఈ బంధం విచ్చిన్నం కావడం శాశ్వతమా లేక తాత్కాలికమా అన్నది.

Tags:    

Similar News