కొడాలికి.. స‌జ్జలకి.. పోలిక ఇదేన‌ట‌.. వైసీపీలో గుస‌గుస

అధికార పార్టీ వైసీపీలో సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి, వైసీపీ కీల‌క నేత‌, సీఎం [more]

Update: 2020-10-25 12:30 GMT

అధికార పార్టీ వైసీపీలో సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి, వైసీపీ కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జల రామ‌కృష్ణారెడ్డికి మ‌ధ్య పోలిక‌లు ఉన్నాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. అదేంటి ? అనే ప్రశ్న, ఆశ్చర్యం.. స‌ర్వత్రా వినిపించ‌డం ఖాయం. దీనికి కార‌ణం.. అత్యంత విన‌య సంప‌న్నుడు.. వివాద ర‌హితుడు, ఆలోచ‌నా ప‌రుడు.. వ్యూహాత్మక వ్యక్తి అయిన‌.. స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ఎక్కడ ‌? వివాదాల‌కుకేరాఫ్‌గా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకుని, నోరు విప్పితే.. క‌ట్తెగిన వ‌ర‌ద‌లా ఏం మాట్లాడుతున్నానో తెలియ‌కుండా మాట్లాడే..ఫైర్ బ్రాండ్ కొడాలి ఎక్కడ ? అనే సందేహం స‌హ‌జం.

తనకు వ్యతిరేకంగా…..

అయితే, ఈ విష‌యంలో క‌రెక్టే కానీ.. వ్యూహాత్మకంగా చూస్తే.. ఇద్దరి మ‌ద్య సారూప్యత‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కొడాలి నానిదే పైచేయి. ఆయ‌న చెప్పిన మాటే ఎవ‌రైనా వినాలి. ఆయ‌న మాట‌కు ఎదురు చెప్పకూడ‌దు. అదే స‌మ‌యంలో త‌ను ఏం మాట్లాడినా పాజిటివ్‌గా ప్రచారం చేయాలి. త‌న‌పై ఎక్క‌డా గుస‌గుస అనేది వినిపించ‌కూడ‌దు. అడిగింది ఇచ్చేయాలి. కోరింది చేసేయాలి.. ఇదీ కొడాలి నైజం. ఈ ప్రచారం గుడివాడ‌లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత….

ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉన్నప్పుడు ఏమోకానీ.. త‌న బ‌లం వ్యక్తిగ‌తంగా పెరిగిన త‌ర్వాత ఇదే ధోర‌ణిలో ఉన్నార‌ని చెబుతున్నారు నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు. గుడివాడ నుంచి నాలుగోసారి విజ‌యం సాధించిన ఆయ‌న ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగానే కాదు రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు. ఇక‌, స‌జ్జల వారిప‌రిస్థితి కూడా డిటోనే అంటున్నారు. ఆయ‌న పాత్రికేయ వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు అంద‌రినీ క‌లుపుకొని పోయారు. పార్టీలో చిన్నా పెద్దా అనే తేడా అంద‌రితోనూ క‌లివిడా ఉన్నారు. ఎన్నిక‌లకు ముందుకూడా ఆయ‌న అందరినీ మ‌చ్చిక చేసుకున్నారు.కానీ, పార్టీ అధికారంలోకి రావ‌డం, కీల‌క‌మైన రాజ‌కీయ స‌ల‌హాదారుగా ప‌ద‌వి ద‌క్కించుకున్న త‌ర్వాత ఆయ‌న తీరుమారిపోయింద‌ట‌.

ఒకరు పైకి….మరొకరు లోలోన…..

వ్యక్తిగ‌తంగా ఎద‌గ‌డం ప్రారంభంచిన త‌ర్వాత దూకుడు పెంచార‌ట‌. ఏ ఎమ్మెల్యే వెళ్లినా.. ఏఎంపీ వెళ్లినా.. క‌నీస మ‌ర్యాద కూడా లేకుండా 'నీగురించి అంతా నాకు తెలుసు' అంటూ.. వారి ముంద‌రి కాళ్లకు బంధం వేసేయ‌డం, వారు చెప్పింది విన్నాక‌.. నీగురించి ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఏం చేయ‌మంటావ్ ‌!? అని ప్రశ్నించ‌డం ఆయ‌న నైజ‌మ‌ని అంటున్నారు. అంటే..త‌న‌కు న‌చ్చితే.. ఒక‌ర‌కంగా న‌చ్చక‌పోతే.. మ‌రోర‌కంగా నేత‌ల‌పై ఆధిప‌త్యం చూపుతున్నార‌ట‌. దీంతో కొడాలి పైకి క‌నిపిస్తున్నారు.. స‌జ్జల‌వారు సైలెంట్‌గా ఉంటూ.. అదే ప‌నిచేస్తున్నారు ! అని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు జ‌గ‌న్ ద‌గ్గర స‌జ్జల వారి ప్రాభ‌వం పైకి వెళుతుండ‌డంతో ఇప్పుడు మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వ‌ర‌కు ఆయ‌న చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న పార్టీలో ప‌ట్టు సాధించుకోవ‌డం ద‌గ్గర నుంచి జ‌గ‌న్‌కు అంత‌కు ముందు స‌న్నిహితంగా ఉన్న నేత‌ల‌ను వెన‌క్కి నెట్టేయ‌డం వర‌కు చాలా క‌థే న‌డిపిస్తున్నార‌ని కూడా వైసీపీలో గుస‌గుస‌లు త‌ర‌చూ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News