బేడీలో ఆ బాస్ నిద్రలేచాడా?

చేసేది మంచి పనైతే అభ్యంతరం ఎందుకు? కిరణ‌్ బేడీ కొన్ని విషయాల్లో తప్పుగా ఆలోచిస్తున్నారని పించక మానదు. కిరణ్ బేడీ నిజయితీపరులానైనా ఆమెలో ఉన్న పోలీసు బాస్ [more]

Update: 2020-01-13 16:30 GMT

చేసేది మంచి పనైతే అభ్యంతరం ఎందుకు? కిరణ‌్ బేడీ కొన్ని విషయాల్లో తప్పుగా ఆలోచిస్తున్నారని పించక మానదు. కిరణ్ బేడీ నిజయితీపరులానైనా ఆమెలో ఉన్న పోలీసు బాస్ మాత్రం అనుక్షణం తట్టి లేపుతుంటాడనే అనిపిస్తుంది. అనవసర విషయాలకు , ఇగోలకు పోయి కిరణ్ బేడీ తన ఇమేజ్ ను డ్యామేజీ చేసుకుంటున్నారనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న వివాదంలో అనేక మంది కిరణ్ బేడీనే తప్పుపడుతున్నారు.

ఇద్దరికీ పొసగక….

గత కొంతకాలంగా కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి పొసగడం లేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కిరణ్ బేడీ తన పాత్ర ఉండాలనుకుంటున్నారు. అందుకే ఆమె గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. నారాయణస్వామిని కుదురుగా కిరణ్ బేడీ పాలన చేయనివ్వడం లేదని పుదుచ్చేరిలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు.

ఉచిత బియ్యం పథకం…..

తాజాగా నారాయణస్వామి ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫేస్టోలోనే పెట్టింది. 2016లో జరిగిన ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నారాయణస్వామి ప్రారభించాలనుకున్నారు. కానీ కిరణ్ బేడీ మాత్రం ఉచిత బియ్యం పంపిణీకి మోకాలడ్డారు. ఉచిత బియ్యానికి బదులుగా నగదును లబ్దిదారుల ఖాతాల్లో బదిలీ చేయాలని కిరణ్ బేడీ రాష్టర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా కిరణ్ బేడీకి వంత పాడుతోంది.

నగదు ఇస్తేనే…?

నిజానికి ఉచిత బియ్యం పంపిణీని ఎవరూ వ్యతిరేకించ కూడదు. నగదు అయితే పక్కదోవ పట్టే అవకాశముంది. ముఖ్యంగా మహిళలు నగదు పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తలు నగదు వస్తే తమకు ఇవ్వరని, మద్యం తాగుతారని అనేక మంది మహిళలు ఇప్పటికీ చెబుతున్నారు. అందుకే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బియ్యం పథకం నేరుగా లబ్దిదారులకు అందిస్తున్నాయి. మహిళగా ఉన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ఈ మాత్రం తెలియదా అన్న ప్రశ్న తలెత్తుంది. కానీ ఆ రాష్ట్రాల్లో లేని అభ్యంతరాలు ఇక్కడ మాత్రమే ఎందుకని నారాయణస్వామి ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు ను ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆశ్రయించాల్సి వచ్చింది.

Tags:    

Similar News