వైసీపీలోకి కిడారి శ్రవ‌ణ్‌..? జ‌గ‌న్ గ్రీన్ సిగ్నల్…‌?

టీడీపీ నుంచి నేత‌ల జంపింగులు మ‌రింత పెర‌గ‌నున్నాయా ? ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం ఎన్నికైన జాప్రతినిధుల‌పైనే వైసీపీ ఆక‌ర్ష్ మంత్రం ప్రయోగించ‌గా.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌పైనా [more]

Update: 2020-06-03 06:30 GMT

టీడీపీ నుంచి నేత‌ల జంపింగులు మ‌రింత పెర‌గ‌నున్నాయా ? ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం ఎన్నికైన జాప్రతినిధుల‌పైనే వైసీపీ ఆక‌ర్ష్ మంత్రం ప్రయోగించ‌గా.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌పైనా దృష్టిపెట్టిందా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ఈ క్రమంలో తొలిగా.. యువ నాయ‌కుడు, మాజీమంత్రి కిడారి శ్రావ‌ణ్‌కుమార్‌ను వైసీపీలోకి తీసుకునేందుకు సీఎం జ‌గ‌న్ ఓకే చెప్పార‌ని తెలిసింది. గ‌తంలో 2014 కు ముందు నుంచి వైసీపీకి మ‌ద్దతిచ్చిన కిడారి స‌ర్వేశ్వర‌రావు కుటుంబం.. వైఎస్‌పై ఎంతో అభిమానం పెంచుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ చేసి.. జ‌గ‌న్‌కు అనుకూలంగా మారిపో యింది.

వైసీపీ నుంచి గెలిచి….

2014లో వైసీపీ త‌ర‌ఫున అర‌కు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం కూడా సాధించారు. అయితే, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో టీడీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పారు. ఇక‌, మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పడంతో స‌ర్వేశ్వర‌రావు టీడీపీలోకి జంప్ చేశారు. ఈలోగా ఆయ‌న‌ను మావోయిస్టులు హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు కిడారి శ్రావ‌ణ్‌ను చంద్రబాబు పార్టీలోకి తీసుకుని మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న ప్రజాప్రతినిధిగా విజ‌యం సాధించ‌క‌పోయినా.. టెక్నిక‌ల్‌గా ఉన్న అవ‌కాశాన్ని వినియోగించుకుని మంత్రిని చేశారు. అయితే క‌నీసం ఎమ్మెల్సీ కూడా కాక‌పోవ‌డంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆరు నెల‌ల ముచ్చటే అయ్యింది.

డిపాజిట్ కూడా రాక….

ఇక గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున శ్రవ‌ణ్‌.. అర‌కు నుంచి పోటీ చేశారు. సెంటిమెంట్ ఫ‌లిస్తుంద‌ని, ఎమ్మెల్యేగా విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, ఆయ‌న డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఇక‌, అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నప్పటికీ.. యువ నేత‌గా ఆయ‌న‌ను ప్రోత్సహించ‌డం లేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం మ‌హానాడు కు కూడా నేరుగా చంద్రబాబునుంచి త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని, ద్వితీయ శ్రేణి నాయ‌కులు మాత్రమే మాట మాత్రంగా చెప్పార‌ని కిడారి వ‌ర్గం చెబుతోంది. ఈ క్రమంలో ఇక‌, పార్టీలో ఉండ‌డం క‌న్నా.. వైసీపీ నుంచివ‌స్తున్న ఆహ్వానాన్ని మ‌న్నించ‌డ‌మే మేల‌ని కిడారి శ్రవ‌ణ్ భావిస్తున్నార‌ని అంటున్నారు.

సిద్ధమవుతున్నారంటూ…..

వైసీపీ కూడా కిడారి కుటుంబంపై పూర్తిస్థాయి వ్యతిరేక‌త‌తో ఏమీలేదు. అంతెందుకు పార్టీ నుంచి జంప్ చేసిన వారి త‌ప్పులేద‌ని, చంద్రబాబు పిలిస్తేనే వారంతా వెళ్లార‌ని ప‌లుమార్లు జ‌గ‌న్ కూడా వ్యాఖ్యానించారు. పైగా కిడారి సర్వేశ్వర్ రావు చ‌నిపోయార‌న్న సానుభూతి కూడా జ‌గ‌న్‌కు ఉంద‌ట‌. ఇప్పుడు కిడారి శ్రవణ్ వ‌స్తానంటే తీసుకునేందుకు సిద్ధమేన‌ని జ‌గ‌న్ వెల్లడించిన‌ట్టు వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ప్రస్తుతం అర‌కులో వైసీపీ విజ‌యం సాధించింది. మ‌రోప‌క్క, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలు మొత్తంగా వైసీపీకి అండ‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీలో ఉండి చేసేది ఏమీలేద‌ని కిడారి వ‌ర్గం కూడా డిసైడ్ అయింది. త్వర‌లోనే పార్టీ మార్పుపై ప్రక‌ట‌న చేసేందుకు కిడారి మాన‌సికంగా సిద్ధమ‌వుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.

Tags:    

Similar News