“కియా” మై కియా

కియా పరిశ్రమ మా వల్లే వచ్చింది. కాదు మా వల్లే. ఇది ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వైసిపి – టిడిపి నడుమ యుద్ధం. ఈ కియా గొడవ [more]

Update: 2019-07-16 05:00 GMT

కియా పరిశ్రమ మా వల్లే వచ్చింది. కాదు మా వల్లే. ఇది ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వైసిపి – టిడిపి నడుమ యుద్ధం. ఈ కియా గొడవ ఆసక్తికరంగా మారింది. దక్షిణ కొరియా కార్ల దిగ్గజ కంపెనీ అనంతపురం రావడం వెనుక క్రెడిట్ కోసం ఇప్పుడు పోరాటం లో కొత్త ట్విస్ట్ లు టిడిపికి ఇబ్బందికరంగా పరిణమించాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కియా పరిశ్రమకు ఆద్యుడని సాక్షాత్తు కంపెనీ ప్రెసిడెంట్ సీఈవో హాన్ వూ పార్క్ రాసిన లేఖ తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పడేసింది. దాంతో కియా చంద్రబాబు కష్టమే అని చెప్పుకోవడానికి విపక్షం నానా తిప్పలు పడుతూ ఉండటం చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ కియా క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడీ కృషి అని ప్రకటించడం మరో చర్చకు దారి తీసింది.

కూల్చేస్తారనే రాసివుంటారన్న గోరంట్ల …

అనంతరపురం కియా పరిశ్రమ తమ నేత ఘనతే అని చెప్పుకుంటూ వచ్చినా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన లేఖ కలకలం సృష్ట్టించింది. కియా ప్రెసిడెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషిని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసేశారు. దీన్ని అస్త్రంగా మార్చుకున్న వైసిపి దాడి మొదలు పెట్టడంతో టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసిపి సర్కార్ వచ్చి రావడంతోనే ప్రజావేదిక వంటివి కూల్చివేయడంతోనే భయపడిన కియా పరిశ్రమ వర్గాలు ఈ లేఖ రాసి వుంటుందని పేర్కొనడంతో సభలో వాడి వేడి చర్చ నడవటం మొదలైంది. సభలో ఎక్కువ సేపు మాట్లాడే ఛాన్స్ లేకపోవడంతో విపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు కియా పరిశ్రమ సాధకుడు చంద్రబాబే అంటూ కీర్తించారు.

ఈ గోల ఆపండి అంటున్న జనం ….

మొత్తానికి ఈ కియా రచ్చపై అంతా విమర్శలు కురిపిస్తున్నారు. క్రెడిట్ మాకంటే మాకు అని సభా సమయం వృధా చేయడం మాని ఎపి అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేయడం మంచిదని అంతా సూచిస్తున్నారు. చరిత్ర చెప్పుకుంటూ డప్పులు కొట్టుకుంటూ కూర్చుని వర్తమాన సమయం వెచ్చిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని మేధావులు చెబుతున్న హితవచనాలు రెండు ప్రధాన పార్టీల చెవులకు ఎక్కుతాయో లేదో చూడాలి. ప్రజలు ఫలానా వారు చేశారు ఈ పని చేశారు అని చెప్పుకోవడం పోయి మేము చేశామంటే మేము అనుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదని అటు అధికారపక్షం విపక్షం ఎప్పటికి గుర్తిస్తాయో మరి.

Tags:    

Similar News