Peddareddy : పాపం పెద్దాయన… అడ్డంగా బుక్కయ్యారు

కేతిరెడ్డి పెద్దారెడ్డి జగన్ పార్టీలో నమ్మకమైన నేత. దశాబ్దాలుగా తాను అనుకున్న కలను సాకారం చేసింది జగన్. అటువంటి జగన్ ను పెద్దారెడ్డి తూలనాడతారా? ఆ అవసరం [more]

Update: 2021-10-19 06:30 GMT

కేతిరెడ్డి పెద్దారెడ్డి జగన్ పార్టీలో నమ్మకమైన నేత. దశాబ్దాలుగా తాను అనుకున్న కలను సాకారం చేసింది జగన్. అటువంటి జగన్ ను పెద్దారెడ్డి తూలనాడతారా? ఆ అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? టీడీపీ అనుకూల మీడియా పెద్దారెడ్డి వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసింది. ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది. పాపం పెద్దాయన మాత్రం అనవసరంగా బుక్కయ్యారన్న కామెంట్స్ నెట్టింట బాగానే విన్పిస్తున్నాయి.

సుదీర్ఘకాలం తర్వాత…..

తాడిప్రతిలో సుదీర్ఘకాలం తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించి కేతిరెడ్డి పెద్దారెడ్డి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. తాను కూడా ఎమ్మెల్యే అయి కలను సాకారం చేసుకున్నారు. తాడిపత్రిలో వైసీపీ గెలవడానికి జగన్ వేవ్ ఒక కారణమైతే, పెద్దారెడ్డి పట్టుదల కూడా మరొక కారణంగా చెప్పాలి. మొత్తం మీద పెద్దారెడ్డి గెలిచినా మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీ చేజారడం ఆయనను రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఫ్రస్టేషన్ లో…

ఆ ఫ్రస్టేషన్ లో ఆయన కొంత తడబడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ కు వర్తించేలా మారాయి. నిజానికి పెద్దారెడ్డి అనింది జేసీ ప్రభాకర్ రెడ్డిని. ఆ విషయం ఆయన వ్యాఖ్యలు విన్నవారికి ఎవరికైనా అర్థమవుతుంది. నాయకుడు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసపుచ్చుతూ బతకడం మంచిది కాదని అన్నారు. దానికి ముందు జగనన్న లాంటి నాయకుడు అనే పదం రావడంతో ఇబ్బందిగా మారింది.

అసలు ఉద్దేశ్యం…..

పెద్దారెడ్డి ఉద్దేశ్యం జగనన్న లాంటి నమ్మకమైన నేత రాష్ట్రంలో ఉండగా అబద్ధాలు చెప్పుకుంటూ జేసీ బతకడం సరికాదని అనాలి. కానీ పెద్దారెడ్డి తడబాటుతో ఆ విమర్శలు జగన్ కు చుట్టుకున్నాయి. దీనిపై పెద్దారెడ్డి పార్టీ కార్యాలయానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తన కామెంట్స్ ను కట్ చేసి మరీ అతికించారని ఆయన సీఎంవో కు కూడా వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. నిజానికి పెద్దారెడ్డి జగన్ ను విమర్శించే అవసరం లేదు. ఆయన కంఫర్ట్ గా వైసీపీలో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి మించి ఆయన పెద్దగా ఆశిస్తున్నది కూడా లేదు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా చిరునవ్వు నవ్వి పెద్దారెడ్డి కామెంట్స్ ను లైట్ గా తీసుకుందంటున్నారు.

Tags:    

Similar News