Tdp : కేశినేని సౌండ్ ఇక వినపడకూడదట

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని పార్టీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఒకటి మాత్రం చంద్రబాబు తేల్చేశారట. పోటీ చేయనని [more]

Update: 2021-10-16 03:30 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని పార్టీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఒకటి మాత్రం చంద్రబాబు తేల్చేశారట. పోటీ చేయనని చెప్పిన వారిని బలవంతం చేసే అవకాశం లేదని చెప్పారట. వచ్చే ఎన్నికలు పార్టీకి సవాల్ అని తెలిసీ కొందరు నేతలు కావాలని లేనిపోని పోకడలకు పోతున్నారని కేశినేని నానిని ఉద్దేశించి పరోక్షంగా అన్నట్లు తెలిసింది. ఎవరు పోటీ చేయకపోయినా ఇబ్బంది ఉండదని కూడా చంద్రబాబు చెప్పారు.

పోటీ చేయనని…..

విజయవాడ ఎంపీ కేశినేని నాని తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అయితే కేశినేని నాని బెదించడానికి అన్నారా? లేక లొంగదీసుకోవడానికి అన్నారా? అన్నది తెలియదు కాని నాని ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. విజయవాడ పార్లమెంటు అభ్యర్థికి కొదవ ఉండదు. పుష్కలంగా బలమైన నేతలు దొరుకుతారు. అందుకే కేశినేని విషయంలో పెద్దగా చంద్రబాబు పట్టించుకోలేదు.

అందుకే ఓకే అన్నట్లే….

కేశినేని నాని వెంట పడి తిరిగి పోటీ చేయాలని ప్రాధేయపడినా ఉపయోగం ఉండదు. పైగా ఆ కారణంగా మరింత మంది ఆ దారిన ప్రయాణిస్తారు. వచ్చే ఎన్నికలలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ తలనొప్పులన్నీ వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే మరో నేత కేశినేని నానిలాగా బెదిరింపులకు దిగకుండా ఆయనను ఇగ్నోర్ చేయడమే బెటర్ అని చంద్రబాబు భావించారు. అందుకే రాయబారం కోసం ఎవరినీ కేశినేని నాని వద్దకు పంపలేదు.

పోటీ చేయకపోయినా….

వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే చెప్పాలని కూడా చంద్రబాబు ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో అన్నట్లు తెలిసింది. ఇప్పటికే మురళి మోహన్, కేఈ కృష్ణమూర్తి, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రకటించారు. వారిని కూడా ఇక ఎవరూ సంప్రదించాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు తెగేసి చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కేశినేని నాని వ్యవహారంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలే తీసుకుంటారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Tags:    

Similar News