కేరళ పోలీసులు షాక్ ఇచ్చారు గా?

దేశంలో అన్ని రాష్ట్రాలది ఒకదారి అయితే కేరళ రూటే సపరేట్. ఎన్నో అంశాల్లో కేరళ అందరికి ఆదర్శం గా నిలుస్తుంది. అవినీతిరహిత పాలన అంశంలో కావొచ్చు క్రైసిస్ [more]

Update: 2021-08-15 09:30 GMT

దేశంలో అన్ని రాష్ట్రాలది ఒకదారి అయితే కేరళ రూటే సపరేట్. ఎన్నో అంశాల్లో కేరళ అందరికి ఆదర్శం గా నిలుస్తుంది. అవినీతిరహిత పాలన అంశంలో కావొచ్చు క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ ఇతర అనేక అంశాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు సరిలేరు ఎవ్వరు అని చాటిచెబుతుంది కేరళ. తాజాగా కేరళ పోలీసులు నమోదు చేసిన ఒక కేసు దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. ఇదే తరహా కేసులు నమోదు దేశం అంతా అమలు చేస్తే మాత్రం సెలబ్రిటీలు, నేతలు అంతా చిక్కుల్లో పడక తప్పదు.

మమ్ముట్టి బుక్ అయ్యారు …

కోలీవుడ్ స్టార్ గానే కాదు మమ్ముట్టి ని అంతా సౌత్ ఇండియన్ స్టార్ గా వెండితెరపై కొలుస్తారు. అలాంటి ఆయనపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనమే అయ్యింది. వాస్తవంగా కోజికోడ్ లో రోబోటిక్ టెక్నాలజీ తో కీళ్ళ మార్పిడి చేసే ఆధునిక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభానికి మరో నటుడు రమేష్ తో కలిసి మమ్ముట్టి హాజరయ్యారు. దీనికి ఆయన మాస్క్ పెట్టుకునే హాజరు అయ్యారు. కానీ ఈ కార్యక్రమంలో మూడు వందలమంది పాల్గొన్నారు. వీరంతా కోవిడ్ నిబంధనలు పాటించలేదని స్థానికుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాములుగా అయితే సెలబ్రిటీ లు, నాయకుల విషయంలో పోలీసులు అంత సీరియస్ గా స్పందించారు.

అందరిపైనా కేసు బుక్ …

కానీ అది కేరళ కావడంతో వారికి ఎవరైనా ఒకటే. దాంతో మమ్ముట్టి తో బాటు మరో నటుడు రమేష్ పైనా ఆసుపత్రి యాజమాన్యం పైనా పాల్గొన్న మూడు వందలమందిపై నిర్మొహమాటంగా కేసు నమోదు చేసేసారు ఖాకీలు. కేరళ పోలీసుల ఈ చర్యపై ఇప్పుడు సోషల్ మీడియా లో సామాన్యులు శభాష్ అంటున్నారు. ఇదే రీతిలో దేశంలో గుంపులపై కేసులు నమోదు చేయగలిగితే కరోనా కట్టడి దేశంలో పెద్ద కష్టతరం కాదన్నది జనాభిప్రాయం. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలనడమే కానీ ఆదర్శంగా ఉండాలిసిన వారే నిబంధనలు ఉల్లంఘిస్తూ సమాజానికి తప్పుడు సందేశం పంపుతున్నారు. దాంతో థర్డ్ వేవ్ ను కోరి ఆహ్వానిస్తున్నట్లే కనిపిస్తుందని నెటిజెన్స్ ఆవేదన చెందుతున్నారు.

Tags:    

Similar News