Tdp : కేఈ అవసరం అంత ఉందా?

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పెను సవాల్ ను ఎదుర్కొంటోంది. నాలుగు జిల్లాల్లోనూ ఎక్కడా బలోపేతం అయ్యే దిశగా నేతలు ప్రయత్నించడం లేదు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలతో [more]

Update: 2021-09-29 08:00 GMT

రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పెను సవాల్ ను ఎదుర్కొంటోంది. నాలుగు జిల్లాల్లోనూ ఎక్కడా బలోపేతం అయ్యే దిశగా నేతలు ప్రయత్నించడం లేదు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలతో మరోసారి ఈ విషయం రుజువయింది. ఇప్పుడు సీమ ప్రాంతంలో ముఖ్యనేత, చంద్రబాబుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం పూర్తిగా పార్టీకి దూరమయిందనే చెప్పాలి. కేఈ సోదరులు పార్టీ ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పట్టించుకోవడం లేదు.

ఎన్నికలకు ముందే….

2019 ఎన్నికలకు ముందే కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తనకుమారుడు శ్యాంబాబు కోసం పోటీ నుంచి దూరమయ్యారు. అయితే గత ఎన్నికల్లో డోన్, పత్తికొండ రెండూ ఓటమి పాలు కావడంతో కేఈ కృష్ణమూర్తి కుటుంబం రాజకీయంగా ఇబ్బంది పడింది. డోన్ కు కేఈ ప్రభాకర్ ను ఇన్ ఛార్జిగా నియమించినా తొలినాళ్లలో కొంత హడావిడి చేసిన ఆయన తర్వాత వదలేశారంటున్నారు.

హర్ట్ అయ్యారా?

కేఈ కృష్ణమూర్తికి పసుపు జెండా అంటే వల్లమాలిన ప్రేమ. తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆ జెండాయే కారణమని ఇప్పటికీ నమ్ముతారు. కానీ చంద్రబాబు గత ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాలు కేఈ కృష్ణమూర్తిని హర్ట్ చేశాయంటారు. కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి తీసుకు రావడంతో పాటు ఆయనకు ప్రయారిటీ ఇవ్వడాన్ని కూడా కేఈ సహించలేకపోయారంటున్నారు. దీనికి తోడు పార్టీ కూడా ఘోర ఓటమి చెందడంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పాలి.

బీసీ నేతగా….

నిజానికి ఇప్పుడు కేఈ అవసరం పార్టీకి ఎంతో ఉంది. బీసీ సామాజికవర్గానికి ఆయన బ్రాండ్ గా చూస్తారు. కనీసం చంద్రబాబు నివాసంపై దాడి జరిగినప్పుడు కూడా కేఈ కృష్ణమూర్తి స్పందించ లేదు. నిజానికి ఆయన సహకారం తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారంటారు. అయితే కేఈ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. మొత్తం మీద కేఈ కుటుంబం మొత్తం ప్రస్తుతానికి టీడీపీకి దూరంగా ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News