కేఈ సున్నితంగా తిరస్కరించారా?

కేఈ కృష్ణమూర్తి పూర్తిగా రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కృష్ణమూర్తి మరింత పార్టీకి దూరమయినట్లే కన్పిస్తుంది. 2019 ఎన్నికలకు ముందే [more]

Update: 2021-05-13 13:30 GMT

కేఈ కృష్ణమూర్తి పూర్తిగా రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కృష్ణమూర్తి మరింత పార్టీకి దూరమయినట్లే కన్పిస్తుంది. 2019 ఎన్నికలకు ముందే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో తన పట్టు సడలకుండా ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం దూకుడుతో ఆయన వెనక్కు తగ్గారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై ఆందోళన ఉన్నప్పటికీ టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో ఆయన ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు.

బలమైన బీసీ నేత….

కేఈ కృష్ణమూర్తి బీసీ నేత. తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి కీలకంగా ఉన్న నేత. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కేఈ కుటుంబానికి కేబినెట్ లో బెర్త్ ఖాయం. గత టీడీపీ హయాంలోనూ కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి గా పనిచేశారు. అయితే అప్పుడు కూడా టీడీపీ నాయకత్వం పట్ల కేఈ కృష్ణమూర్తి సంతృప్తికరంగా లేరు. టీడీపీ లో జరుగుతున్న పరిణామాలు ఆయనను ఇబ్బందికి గురిచేశాయి. తనకు విలువ ఇవ్వడం లేదని గుర్తించిన కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

బాబు ప్రత్యేకంగా….

ఇటీవల చంద్రబాబు కేఈ కృష్ణమూర్తి తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి దూరమయింది. దీంతో ఆయనను మరోసారి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరినట్లు చెబుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినా ఫలితం పెద్దగా లేదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేఈ కృష్ణమూర్తి ని తిరిగి యాక్టివ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

తాను రాలేనంటూ…..?

కానీ కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. తాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేనని చెప్పినట్లు తెలిసింది. తన కుమారుడు, సోదరుల సేవలను వినియోగించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. బీసీ ఓటు బ్యాంకు తిరిగి పొందేందుకు చేయాల్సిన పనులను ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కేఈ కృష్ణమూర్తి తాను ఇక రాజకీయాల జోలికి రానని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

Tags:    

Similar News