మొత్తానికి జగన్ సాధించారుగా

జగన్ కేసీయార్ ట్రాప్ లో పడిపోయాడు, ఏపీని కబ్జా చేయడానికి జగన్ తో కేసీయార్ దోస్తీ చేస్తున్నాడు. ఇవీ టీడీపీ తమ్ముళ్ళ ఆరోపణలు. జగన్ని ఫెడరల్ ఫ్రంట్ [more]

Update: 2019-07-01 02:30 GMT

జగన్ కేసీయార్ ట్రాప్ లో పడిపోయాడు, ఏపీని కబ్జా చేయడానికి జగన్ తో కేసీయార్ దోస్తీ చేస్తున్నాడు. ఇవీ టీడీపీ తమ్ముళ్ళ ఆరోపణలు. జగన్ని ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఆరు నెలల క్రిత్రం ఆహ్వానించారు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. తెరాస వైసీపీ కలసి ఏపీకి ద్రోహం చేయాలని నిర్ణయించాయి అంటూ తమ్ముళ్ళు వెంటనే సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఫెడరల్ ఫ్రంట్ కట్టి ఏపీని దోచేయడానికి జగన్ అవకాశం ఇచ్చాడని కూడా అన్నారు. ఆ తరువాత తెరాస వైసీపీ బాహాటంగా ఎక్కడా కలవలేదు. ఎన్నికలు పూర్తయ్యాక జగన్ ప్రగతిభవన్ కి వచ్చారు. నాటి నుంచి ఇద్దరు సీఎంల మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. ఇక కేసీయార్ మోజులో పడి జగన్ ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నాడని చెప్పిన టీడీపీ నేతల నోళ్ళు మూతపడేలా ఓ కీలక ప్రకటన కేసీయార్ ద్వారా వెలువడేలా జగన్ చేశారు.

పోలవరంపై కేసులు వాపస్ :

పోలవరం ఏపీలో కడితే మాకు తీరని నష్టం. అందువల్ల కట్టొద్దు అంటూ కొర్రీలు పెడుతూ సుప్రీం కోర్టు దాకా వెళ్ళి కేసులు వేసిన తెరాస ప్రభుత్వం ఇపుడు వాటిని వెనక్కు తీసుకుంటోంది. ఈ మేరకు కేసీయార్ స్వయంగా జగన్ సమక్షంలోనే హామీ ఇచ్చారు. ఇకపై కేసులు ఉండవు సరికదా పోలవరం పూర్తి చేయడానికి తన వంతు బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఒడిషా ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు కూడా తాను సిధ్ధమని కేసీయార్ ప్రకటించడం నిజంగా అభినందనీయమే. ఇది నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఈ విషయంలో జగన్ని కూడా మెచ్చుకోవాలి. పొరుగురాష్ట్రంలో మంచి సంబంధలు పెట్టుకోవడం ద్వార ఏం సాధించవచ్చో ఆచరణాత్మకంగా నిరూపించిన నాయకుడుగా జగన్ నిలిచిపోతారు.

ప్రత్యేక హోదాకు బలమే :

ఇక ఏపీకి సంబంధించి మరో కీలకమైన అంశం వుంది. విభజన సమయంలో కేంద్రం హోదాని ఇస్తామని ఆశ చూపి మరీ విడగొట్టింది. అందుకు బీజేపీ కూడా సరేనంది. మరిపుడు అయిదేళ్ళు గడచినా హోదా ఇవ్వనంటోంది. పైగా అంతకు మించిన సాయం అంటూ బీజేపీ గొప్పలు చెబుతోంది. ఈ విషయంలో అయితే జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని ఆయన ప్రధాని మోడీ చెవిలో జోరీగలా పోరుతూనే ఉన్నారు. మరి హోదా ఇవ్వడానికి కేసీయర్ కూడా తన వంతు సాయం చేయాలి. లోక్ సభ ఎన్నికల సమయంలో కేసీయార్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. ఇపుడు కేంద్రానికి లేఖ రాయడం ద్వారా ఆయన ముందుకు వస్తే ఏపీకి మరింత బలం చేకూరుతుంది. మరి జగన్ ఈ విషయంలో కేసీయార్ తో లేఖ రాయిస్తారన్న నమ్మకాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News