రేసులో కేసీఆరే ముందు? అదే జరిగితే?

ప్రతీ సమస్య నాయకుడిని రాటు తేలుస్తుంది. నాయకత్వ లక్షణాలను వెలికితీస్తుంది. అలాగని సమస్యలు అన్నీ ఒక్క విధంగా ఉండవు. పార్టీలో సమస్యలు రచ్చకెక్కితే నాయకుడి వైఫల్యం. దాని [more]

Update: 2020-04-03 09:30 GMT

ప్రతీ సమస్య నాయకుడిని రాటు తేలుస్తుంది. నాయకత్వ లక్షణాలను వెలికితీస్తుంది. అలాగని సమస్యలు అన్నీ ఒక్క విధంగా ఉండవు. పార్టీలో సమస్యలు రచ్చకెక్కితే నాయకుడి వైఫల్యం. దాని వల్ల జరిగే నష్టం పార్టీ భరిస్తుంది. ప్రభుత్వంలో తప్పులు జరిగితే దానికి మూల్యం అయిదేళ్ళకు చెల్లించుకుంటారు. ఇక మరి కొన్ని సమస్యలు కోట్లాది జనంతో లింక్ అయి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే వాటి పర్యవశానాలు ఊహకు కూడా అందకుండా ఉంటాయి.

కరోనా పై….

ఇక దేశమంతా ఒకే ఒక్క విషయంపై చూపు పెట్టింది. ఓ విధంగా దానితోనే ఉక్కిరిబిక్కిరి అవుతోంది అని చెప్పాలి. కరోనా వైరస్ కి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గం. దాంతో భారత్ లాంటి దేశాల్లో జనాలను సరైన వైపు నడిపించడం అతి పెద్ద సవాల్. ఈ విషయంలో తలపండిన మోడీ లాంటి వారే కొంత విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతీ రాష్ట్రంలో పరిస్థితి ఒక్కోలా ఉంది. అక్కడ ముఖ్యమంత్రులు కరోనాపై పోరులో తమదైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. దాని వల్లనే కేసుల పెరుగుదల, తగ్గుదలా కనిపిస్తోంది.

సవాలేనా..?

ఇక పాలనాపరంగా చూసుకుంటే కరోనా వైరస్ ని నియంత్రించడం దేశంలోని ముఖ్యమంత్రులకు అతి పెద్ద చాలెంజ్ అని చెప్పాలి. తెలంగాణా సీఎం కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుంటున్నారని అంతా అంటున్నారు. నిజానికి ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొచ్చినపుడు ముందస్తు కసరత్తు చాలా అవసరం. అది కేసీఆర్ బాగా చేశారనిపిస్తోంది. కేసీఆర్ అన్నీ పక్కాగా లెక్క చూసుకుని చేస్తున్నారు. మీడియాకు కూడా అలాగే అన్నీ చెబుతున్నారు.

విడదీసి చూశారా ..?

కరోనా వైరస్ పై పోరాటం అంటే ఏంటో కేసీఆర్ బాగానే తెలుసుకున్నారు. అదే విజయ సూత్రం కూడా. ఎంతమంది విదేశాల నుంచి తెలంగాణాకు వచ్చారు అన్న లెక్క ఉంచుకుని వచ్చిన వారిని వచ్చినట్లే క్వారంటైన్ చేశారు. అలా పదిహేను రోజులుగా ఒక బిగ్ టాస్క్ లా కేసీఆర్ సర్కార్ చేసింది. ఇపుడు 14 రోజుల పాటు వారిని ఉంచిన అనంతరం విడతల వారీగా ప్రతీ రోజూ విడుదల చేయాలని షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. అంటే స్థానికంగా కరోనా పెద్దగా విస్తరించకుండా వేరు చేసి చూడడంలో కేసీఆర్ సర్కార్ ఇపుడు విజయం సాధించింది. దాని వల్ల పెద్ద ముప్పుని ధీటుగా ఎదుర్కొంది.

ఊరట దక్కేనా …?

ఇకపైన ఉన్న కేసులను స్టడీ చేస్తూ పోతే తొందరలోనే తెలంగాణాకు కరోనా నుంచి భారీ రిలీఫ్ వస్తుంది. ఇదే విషయాన్ని మీడియాకు చెప్పిన కేసీఆర్ అనుకున్నట్లుగా జరిగితే తొందరలోనే కరోనా బారి నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే వ్యూహాన్ని అమలు చేయడంలో మిగిలిన రాష్ట్రాలలో తడబాట్లూ, పొరపాట్లూ జరుగుతున్నాయి. దాంతో జన సమూహానికి కరోనా పాకిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News