ఇది కూడా చేజారితే…. ఇక అంతేనా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు గెలుపు ఇప్పుడు అవసరం. ఇక్కడ గెలవకుంటే బీజేపీ మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశముంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప [more]

Update: 2021-01-22 11:00 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు గెలుపు ఇప్పుడు అవసరం. ఇక్కడ గెలవకుంటే బీజేపీ మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశముంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోలేకపోవడం టీఆర్ఎస్ ను బాగా కుంగదీసింది. మంత్రుల నుంచి కింది స్థాయి నేతల ముఖాల్లోనే అది కన్పిస్తుంది. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్ కు అత్యవసరమని చెప్పక తప్పదు.

ఓటమి తో కుంగిపోయి…..

నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానం. మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే తలదించుకోవాల్సిన పరిస్థిితి టీఆర్ఎస్ నేతలది. ఇప్పటి వరకూ ఓటమి అంటూ ఎరగని టీఆర్ఎస్ కు 2020లో ఓటమిని కోలుకోలేని దెబ్బతీసింది. అక్కడ బలహీనమైన అభ్యర్థి కారణంగా ఓటమి పాలయ్యామని పైకి సాకులు చెబుతున్నా ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలయిందన్నది మాత్రం వాస్తవం. అదే రిజల్ట్ నాగార్జున సాగర్ లో రిపీటీ కాకూడదన్నది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావన.

హడావిడి చేయకుండా….

అందుకోసమే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ హడావిడి పడటం లేదు. అభ్యర్థి ఎంపికలో ఆయన తలమునకలై ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ బలమైన అభ్యర్థి జానారెడ్డిని బరిలోకి దింపుతుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన జానారెడ్డిపై సానుభూతి ఉంది. అందుకే సానుభూతిని తలదన్నేలా అభ్యర్థి ఎంపిక ఉండాలన్నది కేసీఆర్ లక్ష్యంగా ఉంది. అందుకే ఆయన అనేక సార్లు ఇప్పటికే సర్వేలు చేయించారంటున్నారు.

ఆచితూచి నిర్ణయం….

ఇప్పటికే నాగార్జున సాగర్ లో రెండు సార్లు కేసీఆర్ సర్వే చేయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు భగత్ తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. భగత్ కు టిక్కెట్ ఇవ్వకుంటే ప్రధాన సామాజిక వర్గం దూరమయ్యే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా అనేకమంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే తొందరపడకూడదని, పోటీ పడే అభ్యర్థులందరితో కేసీఆర్ స్వయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. సాగర్ లో మరోసారి పరాభవం ఎదురు కాకుండా కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Tags:    

Similar News