కేసీఆర్ అనుకున్నది సాధ్యం కానే కాదట

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్ ఫ‌్రంట్ సాధ్యమవుతుందా? అది జరిగే పనేనా? ఎంతమంది ముందుకు వస్తారు? అన్నది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా [more]

Update: 2020-12-19 17:30 GMT

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్ ఫ‌్రంట్ సాధ్యమవుతుందా? అది జరిగే పనేనా? ఎంతమంది ముందుకు వస్తారు? అన్నది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల రైతు ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కొంత వ్యతిరేకత కన్పిస్తుంది. బీజేపీ పై అనేక రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో రాష్ట్రాలు తీవ్రంగా ఆర్థిక నష్టాలు చవిచూసినా, జీఎస్టీ విషయంలో తీసుకున్న నిర్ణయంపై భగ్గుమంటున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా…..

బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కొన్ని పార్టీలకు లేవు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై బాగానే కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ దూకుడుతో బీజేపీ నుంచి తనకు ముప్పు ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి కూడా తన మద్దతు ప్రకటించారు.

జాతీయ రాజీకీయాల్లో…..

బీజేపీని కేంద్ర స్థాయిలో నిలువవరించాలంటే చెక్ ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. తన కుమారుడు కేటీఆర్ కు రాష్ట్ర రాజకీయాలు వదిలిపెట్టి తాను జాతీయ రాజకీయాలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇప్పటికే ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటుకు ఆయన ఒక ప్రణాళిక సిద్దం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అది సాధ్యమయ్యేనా?

గతంలోనూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకలో కుమారస్వామి, బెంగాల్ లో మమత బెనర్జీ, ఉత్తర్ ప్రదేశ్ లో అఖలేష్ యాదవ్ వంటి వారిని కలిశారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికలు ఉండటంతో వారు బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. అయితే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యమ్నాయంగా ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ‌్రంట్ కు పొరుగు రాష్ట్రమైన ఏపీ నుంచే మద్దతు దొరకదు. జగన్, చంద్రబాబు ఇద్దరూ బీజేపీకి దగ్గరగానే ఉన్నారు. నవీన్ పట్నాయక్ పరిస్థితి అంతే. ఎప్పటిలాగానే కుమారస్వామి, మమత బెనర్జీ, అఖిలేష్ వంటి వారు మాత్రమే మిగులుతారంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదంటున్నారు.

Tags:    

Similar News