మళ్ళీ ఆయనదే విజయం

రాజు బలవంతుడు అయితే రాజ్యం అదుపాజ్ఞల్లో ఉంటుంది. కేసీఆర్ చతురుడు, చాణక్యుడు., శత్రువు వ్యూహాలు ఎరిగిన వాడు. అనువు కోసం ఎదురు చూసిన వాడు. కాలం కలిసి [more]

Update: 2019-11-29 00:30 GMT

రాజు బలవంతుడు అయితే రాజ్యం అదుపాజ్ఞల్లో ఉంటుంది. కేసీఆర్ చతురుడు, చాణక్యుడు., శత్రువు వ్యూహాలు ఎరిగిన వాడు. అనువు కోసం ఎదురు చూసిన వాడు. కాలం కలిసి రాకున్నా ఎప్పుడూ ఎక్కడా తొణక లేదు. అప్పుడు ఇప్పుడు…. అంతా అయిపోయింది అనుకున్న వేళ… ఓటమి ఆవహించిన వేళ కూడా నిరాశ పడలేదు. నెత్తుటి చుక్క చిందకుండా అనుకున్నది సాధించాడు. నెత్తురు చిందలేదా అంటే….. కేసీఆర్ ఉద్యమాన్ని హింసాత్మకం చేసి ఉంటే ఎప్పుడో అది మట్టి కరిచేది. ఉద్యమాన్ని అదుపాజ్ఞల్లో ఉంచినా., అది పక్కదారి పట్టకుండా కోరుకున్నది సాధించడం… కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.

మనసెరిగిన రాజు….

మిగతా వారి త్యాగాలు, పోరాటాలు , ఆందోళనలు, ఆవేశాలు స్వీయ ప్రయోగాలో, భావావేశాలో తప్ప సొంతం కాదు. 2009 డిసెంబర్ 9 తర్వాత కూడా చాలా మంది తెలంగాణ రాదని నమ్మకంగా ఉన్నా, సడలని సంకల్పంతో ఉన్నది కేసీఆర్ ఒక్కడే. ఇన్నేళ్ల తర్వాత అక్కడ సంక్షోభ పరిస్థితులు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు చూసిన తర్వాత మనసెరిగిన రాజు ఎలా చేస్తాడని ఆశిస్తారో అలాగే ప్రవర్తించాడు.

గెలుపా… ఓటమా…?

ఎంతటి క్రౌర్యం.., ఎంతటి కర్కశత్వం….. జాలి దయ లేని రాతి హృదయం అని ప్రత్యర్థులు గేలి చేసినా చలించనిది అందుకే. తనకు తన లక్ష్యం తెలుసు. అందుకే మళ్ళీ గెలిచాడు.. ఉద్యమాన్ని , సమ్మెల్ని కాదు జనం హృదయాలను….. ఇది వ్యతిరేక అర్థంలో కూడా ప్రచారం చేయొచ్చు. కానీ తర్కం, సత్యం, వాస్తవిక పరిస్థితులను బేరీజు వేస్తే ఆయన చేసినదే కరెక్ట్. రాజు కఠినాత్ముడు, క్రూరుడు కానక్కర్లేదు….. ప్రజలకు దయార్ద్ర హృదయుడు అని అనిపిస్తే చాలు… మళ్ళీ నమ్మడానికి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో అదే జరిగింది. తిట్టిన తిట్లు…పెట్టిన శాపనార్ధాలు మరిచి ఇప్పుడు కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తున్నారు. దటీజ్ కేసీఆర్.

Tags:    

Similar News