కేసీఆర్ “రూటే” వెరైటీ

నిన్న మొన్నటి వరకూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకనేది లేదని, షరతులతో అయితే చేరవచ్చని, ప్రభుత్వం వద్ద నిధులే లేవని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు [more]

Update: 2019-11-28 16:20 GMT

నిన్న మొన్నటి వరకూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకనేది లేదని, షరతులతో అయితే చేరవచ్చని, ప్రభుత్వం వద్ద నిధులే లేవని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకున్నారు. ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచే విధుల్లోకి చేరవచ్చని తెలిపారు. ఆర్టీసీకి వంద కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తామని చెప్పారు. యూనియన్ నేతలు, విపక్షాల మాటలను నమ్మి కార్మికులు తప్పుదోవ పట్టారన్నారు. తాను కార్మికుల పొట్టకొట్టే వ్యక్తిని కాదన్నారు.

కార్మికులతోనే చర్చలు..యూనియన్లతో కాదు….

కార్మికులతో తాను చర్చలు జరపనని ఎవరన్నారని ప్రశ్నించారు. తాను త్వరలోనే కార్మికులను ప్రగతి భవన్ కు పిలచి వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటానని చెప్పారు. చనిపోయిన కుటుంబాల పట్ల కూడా కేసీఆర్ పెద్దమనసుతో వ్యవహరించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే యూనియన్ల విషయంలో మాత్రం తాను కఠినంగా ఉంటానని, యూనియన్ నేతలను మాత్రం తాను క్షమించనని, తన దగ్గరకు రానివ్వనని కేసీఆర్ తెలిపారు. యూనియన్లు లేని ఆర్టీసీ ఉండాలన్నారు.

పాలాభిషేకంతో…..

నిన్నటి వరకూ కేసీఆర్ ను తిట్టిపోసిన కార్మికులు ఆయన ప్రకటనతో పాలాభిషేకం డిపోల వద్ద చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి కూడా కేసీఆర్ ప్రకటనను స్వాగతించారు. కార్మికులు వెంటనే విధుల్లోకి జాయిన్ అవ్వాలని సూచించారు. కేసీఆర్ తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తాము సమ్మె చేస్తున్న కాలంలో ఇబ్బంది పడిన ప్రజలు కూడా తమను క్షమించాలని కోరారు. అయితే కిలోమీటరుకు 20 పైసలు ఛార్జీలను కేసీఆర్ పెంచడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News