జగన్ పేరు ఎత్తలేదు.. బాబును మాత్రం?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ఒక్క మాట కూడా అనలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదాన్ని ఆయన లైట్ గానే తీసుకున్నట్లు కనపడుతోంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, [more]

Update: 2020-05-19 05:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ఒక్క మాట కూడా అనలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదాన్ని ఆయన లైట్ గానే తీసుకున్నట్లు కనపడుతోంది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం వదల లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోతిరెడ్డి వివాదం అంటుకున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ పోతిరెడ్డిపాడు వివాదం పై కేసీఆర్ స్పందించలేదు. అయితే కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు మాత్రం తెలంగాణ ఫిర్యాదు చేసింది.

పోతిరెడ్డిపాడుపై….

తొలిసారి మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ప్రధానంగా లాక్ డౌన్ మినహాయింపులు, తెలంగాణలో వ్యవసాయంపై ఆయన అనర్గళంగా మాట్లాడి తన ప్రసంగాన్ని ముగించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై ఆయన స్పందించకుండానే మీడియా సమావేశం ముగించారు. కానీ మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం తనదైన శైలిలో స్పందించారు. పోతిరెడ్డిపాడుపై తమ విధానం తమకు ఉందని, అందరిలా తాను యాగీ చేసేవాడిని కాదన్నారు.

బాబు కిరికిరి….

గతంలో చంద్రబాబు కిరికిరి పెట్టారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం బాబ్లీ వెళ్లి హంగామా చేశారన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తో తాను సఖ్యతగా ఉన్నానన్నారు. నీళ్లను రెండు రాష్ట్రాలు ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇరువురం చర్చించుకున్నామని చెప్పారు. గోదావరిలో వెయ్యి టీఎంసీలు వృధాగా ఉన్నాయన్నారు. వాటిని ఏపీ వినియోగించుకోవచ్చని తెలిపారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందేనని చెప్పారు.

రాజీ పడేది లేదంటూనే….

కానీ జీవో నెంబరు 203ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దానిపై ఎంతవరకూ వెళ్లాలో అంతవరకూ వెళతామని చెప్పారు. అయినా తమ మధ్య విభేదాలు లేవని, కొందరు కళ్లుకుట్టుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదని చెబుతూనే తమకు కొట్లాడే ఉద్దేశ్యం లేదన్నారు. కలసి అన్యోన్యంగానే ఉన్నామని, బేసిన్లు, భేషజాలు లేవని కొట్టి పారేశారు. మొత్తం మీడియా సమావేశంలో చంద్రబాబును విమర్శించిన కేసీఆర్ జగన్ పేరు మాత్రం ఎత్తకపోవడం రాజకీయంగా చర్చీనీయాంశమైంది.

Tags:    

Similar News