హేమాహేమీలు ఎవరు? కొత్త వారు కావాల్సిందే?

తెలంగాణలో హేమాహేమీలుగా చెలామణి అయిన నేతలు ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇప్పట్లో ఎలాంటి పదవులు భర్తీ లేకపోవడంతో వారి ఆశలపై అధినాయకత్వం నీళ్లు చల్లినట్లే. గత ఎన్నికల్లో [more]

Update: 2020-03-28 09:30 GMT

తెలంగాణలో హేమాహేమీలుగా చెలామణి అయిన నేతలు ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇప్పట్లో ఎలాంటి పదవులు భర్తీ లేకపోవడంతో వారి ఆశలపై అధినాయకత్వం నీళ్లు చల్లినట్లే. గత ఎన్నికల్లో ఓటమి పాలయని నేతలను ఈసారి కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. తొలి దఫా విజయం తర్వాత కీలక నేతలను మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకున్నారు. అందులో తుమ్మల నాగేశ్వరరావు, నాయని నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

రెండోసారి సీఎం అయ్యాక….

అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది. 2018 ఎన్నికలలో అనేకమంది కీలక నేతలు ఓటమి పాలయ్యారు. వీరంతా పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. వీరిని శాసనమండలికి తీసుకుంటారని భావించారు. పట్నం మహేందర్ రెడ్డిని తప్పించి ఓటమి పాలయిన వారెవరికీ శాసనమండలి ఛాన్స్ ఇవ్వలేదు కేసీఆర్.

రాజ్యసభ పోస్టుల్లోనూ…..

ఇక తాజాగా రాజ్యసభ పదవులు రెండు భర్తీ అయ్యాయి. అందులో ఒకటి కె.కేశవరావును తిరిగి రాజ్యసభకు కొనసాగించారు. కొత్తగా పార్టీలో చేరిన సురేష‌ రెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు. అంతేతప్ప పాత వారెవరకీ రాజ్యసభ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత చూపలేదు. మరోవైపు తన సీటును త్యాగం చేసిన పొంగులేటి శ్రీనివాసులు రెడ్డిని కూడా కేసీఆర్ పక్కన పెట్టారు. ఈసారి కేసీఆర్ సెలక్షన్ అంతా పక్కాగా ఉందంటున్నారు. నాయని నరసింహారెడ్డి కూడా తనకు రాజ్యసభ పదవి కావాలని నేరుగా కేసీఆర్ నే కోరారు.

ఇబ్బందులు లేకుండా ఉండేందుకేనా?

ఇందుకు ప్రధాన కారణం భవిష్యత్తులో తన కుమారుడు కేటీఆర్ కు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డి వంటి వారిని పక్కన పెట్టడం వెనక కేటీఆర్ ప్రమేయం ఉందంటున్నారు. అక్కడ కొత్త తరం నాయకత్వాన్ని కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. ఈ సీనియర్లకు ఇక ప్రభుత్వంలో ఛాన్స్ లేదంటున్నారు పార్టీ నేతలు. మరి కేసీఆర్ భవిష్యత్తులో వీరికి చోటు కల్పిస్తారా? అన్నది కష్టమేనన్నది వాస్తవం.

Tags:    

Similar News