ఇప్పుడే కాదటగా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపొయింది. వయోభారం అనారోగ్య సమస్యలతో ఆయన విధులు నిర్వర్తించలేక పోతున్నారు. నెక్స్ట్ బాస్ పార్టీకి కేటీఆర్. సో ఆయనకు ముందే గాలి [more]

Update: 2020-01-26 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపొయింది. వయోభారం అనారోగ్య సమస్యలతో ఆయన విధులు నిర్వర్తించలేక పోతున్నారు. నెక్స్ట్ బాస్ పార్టీకి కేటీఆర్. సో ఆయనకు ముందే గాలి కొట్టేస్తే పోలా. అనుకున్న మంత్రులనుంచి కింది స్థాయి వరకు కాబోయే సిఎం కేటీఆర్ అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తమ బెర్త్ లు కాపాడుకునేందుకు కొందరు అందలం ఎక్కుదామని మరికొందరు ముందస్తు భజనలతో రేపోమాపో కేటీఆర్ కారు స్టీరింగ్ తిప్పేస్తారనే అంతా లెక్కేశారు.

నేను ఫుల్ ఫిట్ ….

మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో టి సిఎం కేసీఆర్ మంచి జోష్ మీదకు వచ్చారు. వెంటనే మీడియా ముందుకు వచ్చి మంచి చెడ్డా ముచ్చట పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాను హెల్త్ చెక్ అప్ కి వెళితే తన పని అయిపోయిందని మీడియా లో వచ్చిన ప్రచారం పై వివరణ ఇచ్చేశారు. దుక్కలా ఉన్నావని వైద్యులు సర్టిఫై చేశారని ప్రస్తుతం ప్రజల్లో సైతం తనపై వ్యతిరేకత ఏమీ లేదని చెబుతూ ఉత్సహంగా పదవిలో ఉండబోతున్నట్లు పరోక్షంగా చెప్పేశారు.

అటు వెళ్లనంటూ….

అలాగే కేంద్ర రాజకీయాలవైపు వెళతాను అనే ప్రచారాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రిగానే కొనసాగనున్నట్లు తేల్చేశారు. తాను తెలంగాణ ప్రజలకు ఇంకా సేవ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తనను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, వారి ఆశీస్సులే తన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని చెప్పారు. దాంతో గులాబీ పార్టీలో అంతర్గతంగా ముఖ్యమంత్రి మారుతారన్న ప్రచారానికి పూర్తిగా తెరపడింది. అదే విధంగా తెలంగాణ లో ఈ వ్యవహారాలపై నిత్యం నడుస్తున్న ఊహాగానాలకు తెరదించేశారు గులాబీ బాస్.

Tags:    

Similar News