ఇక కేసీఆర్ మకాం ఢిల్లీలోనేట

జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు [more]

Update: 2021-04-15 09:30 GMT

జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ అనేక సార్లు ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకూ థర్డ్ ఫ్రంట్ రూపుదాల్చలేదు. అయితే తాజాగా మమత బెనర్జీ రాసిన లేఖతో మరోసారి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రెండోసారి అధికారంలోకి…..

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని కేసీఆర్ చెప్పారు. సాగునీటికి అవసరమైన నీళ్లున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవి సముద్రం పాలవుతున్నాయని కేసీఆర్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తమ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, వీటికి చెక్ పెట్టాలంటే థర్డ్ ఫ్రంట్ అవసరమని కేసీఆర్ బలంగా నమ్మారు. అంతటితో ఆగకుండా అన్ని రాష్ట్రాలను కలియ తిరిగి వచ్చారు.

అందరినీ కలసి….

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లతో భేటీ అయ్యారు. తన ఆలోచనలను వారి ముందు ఉంచారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో బలమైన కూటమిని ఏర్పాటు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాలకు అన్యాయం చేయదని ఆయన లెక్కలతో సహా వివరించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత…..

ఇప్పుడు మమత బెనర్జీ లేఖ రాసిన తర్వాత మరోసారి కేసీఆర్ ఆలోచన థర్డ్ ఫ్రంట్ పైకి మళ్లిందంటున్నారు. బీజేపీ జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ రాజీకీయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఫలితాల తర్వాత కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేస్తారంటున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ‌్రంట్ ప్రయత్నాలు మొదలు పెట్టాలని నిర్ణయించారు.

Tags:    

Similar News