కేసీఆర్ స్పెషల్ ఫోకస్

ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ [more]

Update: 2019-10-01 00:30 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏ సహకారం అయినా పార్టీ నుంచి అందుతుందని, ఎప్పటికప్పుడు తనతో టచ్ లో ఉండాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. వచ్చే నెల 21వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

గంటల వ్యవధిలోనే…

నోటిఫికేషన్ వెలువడిన గంటలోనే హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన సైదిరెడ్డినే తిరిగి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అభివృద్ధి నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్లాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ నేతలందరూ నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక వర్గాల ఆధారంగా హుజూర్ నగర్ లో కేసీఆర్ ఇన్ ఛార్జులను నియమించారు.

ముందుగానే అప్రమత్తం….

గత ఎన్నికల్లో వంద స్థానాలకు పైగా గెలుచుకున్న కేసీఆర్ ఈ ఉప ఎన్నికను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఓటమి పాలయితే ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందన్న సంకేతాలు వెళతాయని ఆయన ముందుగానే అప్రమత్తమయ్యారు. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు ఉండటం వల్లనే ఓటమి పాలయ్యామని, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే ఓటర్లను అప్రమత్తం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఉప ఎన్నికల స్పెషలిస్ట్…..

కేసీఆర్ పార్టీకి ఉప ఎన్నికల స్పెషలిస్ట్ గా పేరుంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతూ వస్తోంది. ఒక్కొక్క మండలానికి ఐదు నుంచి ఏడుగురిని కేసీఆర్ ఇన్ ఛార్జిగా నియమించారు. బూత్ స్థాయి నుంచి ఓటర్లను కలుసుకునేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మండలాల వారీగా బాధ్యులను చేశారు. ఒక్కొక్క గ్రామం వారికి కేటాయించారు. ఆ గ్రామ పరిధిలో ఓట్లు పోలయ్యేంతవరకూ వారిపైనే బాధ్యతను ఉంచారు. ఎప్పటికప్పుడు తనకు క్షేత్రస్థాయి నివేదికలను అందించాలని కోరారు. తాను కూడా ప్రచారానికి రానున్నానని, ఎక్కడ, ఎన్ని చోట్ల ప్రచారం చేస్తే బాగుంటుందో సూచించాలని కేసీఆర్ పార్టీ నేతలను కోరారు. మొత్తం మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికపైన కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Tags:    

Similar News