రియలిస్టిక్ గానే

ఈసారి తెలంగాణ బడ్జెట్ కేసీఆర్ ఎలా ప్రవేశపెట్టబోతున్నారు. గత బడ్జెట్ లో బడ్జెట్ అంచనాలను తగ్గించి కేసీఆర్ అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఈసారి బడ్జెట్ కూడా వాస్తవికతతోనే [more]

Update: 2020-02-25 09:30 GMT

ఈసారి తెలంగాణ బడ్జెట్ కేసీఆర్ ఎలా ప్రవేశపెట్టబోతున్నారు. గత బడ్జెట్ లో బడ్జెట్ అంచనాలను తగ్గించి కేసీఆర్ అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఈసారి బడ్జెట్ కూడా వాస్తవికతతోనే ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ పై కసరత్తు పూర్యింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపుపై అధికారులు పనిచేస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా అంచనాలు తగ్గిస్తారా? లేక పెంచుతారా? అన్న చర్చ జరుగుతోంది.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనే….

పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మొత్తం లక్షా 36 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గతంలో కన్నా 32 వేల కోట్లను అంచనాల్లో తగ్గించింది. ఆర్థిక మాంద్యం దృష్ట్యా అంచనాలను తగ్గించాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు. అయితే తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా పడలేదు. వృద్ధిరేటు కూడా ప్రస్తుత లెక్కల ప్రకారం పదిశాతం వరకూ ఉంటుందని చెబుతున్నారు. దీంతో బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం అందుకుంటుందని చెబుతున్నారు.

స్వల్పంగా పెరుగుదల…..

అయితే ఈసారి బడ్జెట్ పది నుంచి పన్నెండు శాతం గత బడ్జెట్ కన్నా పెరిగే అవకాశముంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే కేసీఆర్ వరస సమీక్షలు నిర్వహించారు కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా చీఫ్ సెక్రటరీ సోమేష‌ కుమార్ సయితం వివిధ శాఖల అధికారులతో వరస భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం శాఖలకు నిధుల కేటాయింపు జరిపేందుకు కసరత్తు చేశారు.

వాస్తవికత ఆధారంగానే….

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి , ఖర్చులు , వ్యయాలను లెక్కలేసుకుంటూ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాస్తవిక పరిస్థితులకు దూరంగా బడ్జెట్ ను ప్రవేశపెడుతూ వచ్చింది కేసీఆర్ సర్కార్. అయితే ఇకపై అలా జరగకూడదని కేసీఆర్ గత శాసనసభ సమావేశాల్లోనే హామీ ఇచ్చారు. దీని ప్రకారం ఈసారి తెలంగాణ బడ్జెట్ లక్షా యాభై కోట్లకు మించకపోవచ్చన్నది అధికారుల మాటలను బట్టి తెలుస్తోంది. రియాలిటీకి దగ్గరగానే వెళ్లాలని సీఎం హెచ్చరికలతో బడ్జెట్ ను వాస్తవికతతో రూపొందించారంటున్నారు.

Tags:    

Similar News