కేసీఆర్ సరే… మరి జగన్ సంగతేంటి?

కేసీఆర్ రాజకీయ జీవితం చాలా గొప్పది, సుదీర్ఘమైనది. ఎందుకంటే ఆయన 1981 ప్రాంతంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తొలి పార్టీ కాంగ్రెస్. అలా దిగువ స్థాయిలో పనిచేస్తూ [more]

Update: 2020-04-07 06:30 GMT

కేసీఆర్ రాజకీయ జీవితం చాలా గొప్పది, సుదీర్ఘమైనది. ఎందుకంటే ఆయన 1981 ప్రాంతంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తొలి పార్టీ కాంగ్రెస్. అలా దిగువ స్థాయిలో పనిచేస్తూ అప్పటి సీఎం చెన్నారెడ్డి వంటి పెద్దల మన్ననలు ఆదిలోనే అందుకున్నారు. ఆ తరువాత టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ మీదట చంద్రబాబుకు ప్రియ సహచరునిగా మెలగుతూ టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తరువాత టీడీపీ నుంచి వేరుపడి టీఆర్ఎస్ ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా పద్నాలుగేళ్ళు ఉద్యమం నడపడం కేసీఆర్ కే చెల్లింది. ఇక 2014, 2018 ఎన్నికల్లో రెండు సార్లు గెలిచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. కేసీఆర్ అంటే పత్రికలకూ, వాటి యజమానులకూ హడల్ అన్నట్లుగా పరిస్థితి ఎపుడూ ఉంది. ఇపుడు కూడా టీఆర్ఎస్ మీద గట్టిగా వార్తలు రాసే సీన్ తెలంగాణాలో ఎవరికీ లేదు. కానీ కేసీఆర్ మళ్ళీ మీడియా మీద గట్టిగానే గద్దిస్తున్నారు. ఏకంగా పెద్ద హెచ్చరికలే జారీ చేస్తున్నారు.

కరోనా సమరంలో…

కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ బాగానే స్పందిస్తోంది. అయితే పొరపాట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇది చాలా సంక్లిష్టమైన సమయం. నిజంగా చెప్పాలంటే కరోనా కట్టడి అన్నది ఎవరి చేతిలో ఎంత ఉందో ఎవరికీ తెలియని దుస్థితి. ప్రజలే చైతన్యం కావాలని ప్రభువులు అంటారు. ఆ ప్రజలు తమ ఆకలి బాధ కోసం రోడ్డు ఎక్కకతప్పడంలేదు. మరో వైపు ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు కరవు ఎపుడూ ఉన్నదే. ఇలా అన్ని రకాలైన బలహీనతలు, రుగ్మతలు వెరసి కరోనా కట్టడిని ఓ వైపు తూట్లు పొడుస్తున్న మాట వాస్తవం. కానీ బాధ్యత కలిగిన మీడియా ఈ విషయంలో చేయాల్సినది చాలా ఉంది. తప్పులు ఉంటే వాటిని ఈ టైంలో పెద్దవిగా చేసి చూపించకూడదు. కానీ యధా ప్రకారం మీడియా కూడా దాని మీదనే దృష్టి పెడుతోంది.

కేసీఆర్ మార్క్ శాపాలు…

ఇక కరోనా వైరస్ పై దాదాపుగా అంతా యుధ్ధమే చేస్తున్నామని కేసీఆర్ అంటున్నారు. బతికుంటే బలుసాకు తినవచ్చు అన్న భావన అందరిలోనూ కలగాలని కూడా ఆయన చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని సెక్షన్ల మీడియా మీద మాత్రం మకిలి రాతలు, వెకిలి రాతలూ రాస్తోందని కేసీఆర్ మండిపడుతున్నారు. ఇది తగునా అని ఆవేశంగానే ప్రశ్నిస్తున్నారు. తాను ఎవరికీ ఉపేక్షించనని, అన్నీ గుర్తుపెట్టుకుని సరైన సమయంలో వారి సంగతి తేలుస్తామని కూడా వార్నింగులు ఇస్తున్నారు. కరోనా శాపాలు వారికి కట్టి కుదుపుతాయని కూడా ఆయన అంటున్నారు. సోషల్ మీడియా లో ఒక భాగం యాంటీ సోషల్ గా మారిందని, వారి మీద కూడా కేసులు పెడతామని కేసీఆర్ గట్టిగానే అంటున్నారు.

జగన్ సంగతేంటి…?

మరి కేసీఆర్ ఒక్కరిదే ఈ బాధ కాదు, జగన్ విషయం తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉందని చెప్పాలి. జగన్ ని అసలు మీడియా వదిలేస్తేనా. ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరీ బదనాం చేస్తోంది. కరోనా కేసుల కట్టడి విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారని ఓపేన్ గానే తీర్పు ఇచ్చేస్తోంది. జగన్ అసమర్ధుడన్నట్లుగా కలరింగు ఇస్తోంది మరి ఇంత జరిగినా జగన్ ఎక్కడా మీడియా మీద పల్లెత్తు మాట అనలేదు. కేసీఆర్ కి తొంబై శాతం సానుకూలత మీడియా ప్రపంచంలో ఉంది. పది శాతం వ్యతిరేకతకే ఆయన గర్జిస్తున్నారు. మరి జగన్ దీని మీద ఎంత పెద్దగా నోరు చేసుకోవాలి ఎన్ని రకాల కేసులు పెట్టాలి. నిజంగా కేసీఆర్ చెప్పినది కూడా కరెక్టే, వెకిలి రాతలు, మకిలి రాతలు రాస్తున్న వారిని ఇపుడు కట్టడి చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది కరోనా కాబట్టి. బాధ్యత లేని వారి విషయంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. కేసీఆర్ దానికి రెడీగా ఉన్నారు. మరి జగన్ కి ఆ దమ్ము ఉందా. లేక ఊరికే కేసులు పెడతామని వైసీపీ మంత్రులు ప్రతీ రోజూ చెప్పడమేనా?

Tags:    

Similar News