పల్నాడులో టీడీపీకి చెక్.. జోరు పెంచిన యువ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా ప‌ల్నాడు రాజ‌కీయాలు ఎప్పుడూ డిఫ‌రెంటే. ఇక్క‌డ విభిన్నమైన రాజ‌కీయ ప‌రిస్థితులు ఉన్నాయి. ప్రజ‌లు ఏ ఒక్క పార్టీనీ, ఏ ఒక్క నాయ‌కుడిని భుజాల‌కు ఎక్కించుకున్నది [more]

Update: 2020-05-16 05:00 GMT

గుంటూరు జిల్లా ప‌ల్నాడు రాజ‌కీయాలు ఎప్పుడూ డిఫ‌రెంటే. ఇక్క‌డ విభిన్నమైన రాజ‌కీయ ప‌రిస్థితులు ఉన్నాయి. ప్రజ‌లు ఏ ఒక్క పార్టీనీ, ఏ ఒక్క నాయ‌కుడిని భుజాల‌కు ఎక్కించుకున్నది లేదు. అలాగ‌ని దూరం పెట్టింది కూడా లేదు. అయితే, ఎప్పటి ప‌రిస్థితులకు అనుగుణంగా అప్పుడే ఇక్కడ ప్ర‌జ‌ల రాజ‌కీయ మూడ్ మారిపోతుంటుంది. ఇప్పుడు కూడా ప‌ల్నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్తరంగా మారాయి. ప‌ల్నాడు ప్రాంతంలోని కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వినుకొండ‌, గుర‌జాల ఉన్నాయి. వీటిలో టీడీపీ దూకుడు ఒక‌ప్పుడు ఎక్కువ‌గానే ఉంది. ముఖ్యంగా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం తీసుకుంటే.. టీడీపీ నాయ‌కుడు య‌ర‌ప‌తినేని త‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం ఉంద‌ని ప‌లుమార్లు చెప్పుకొన్నారు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా గుర‌జాల‌ను త‌న అడ్డాగా చేసుకుని రాజ‌కీయాలు చేస్తోన్న య‌ర‌ప‌తినేని 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించారు.

కుడి చేత్తో కోట్లు సంపాదించి….

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న విజ‌యంపై చాలానే ఆశ‌లు పెట్టుకు న్నారు. గ‌ర్భిణుల‌కు సీమంతం చేయ‌డం, వృద్ధుల‌కు పింఛ‌న్లు పంపిణీ చేయ‌డం, ఏదైనా ఆప‌ద వ‌స్తే.. వారిని ఆదుకోవ‌డం వంటి కార్యక్రమాలు బాగానే చేప‌ట్టారు. అయితే, ఆయ‌న వెనుక మాత్రం గ‌నుల కేసును మూట‌గ‌ట్టుకున్నారు. కుడి చేత్తో కోట్లు సంపాయించి.. ఎడ‌మ చేత్తో వేలు ఖ‌ర్చు పెట్టార‌నే విమ‌ర్శలు ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. అయితే, ఇంత బ‌లంగా య‌ర‌ప‌తినేని బాగోతంపై ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లిన నాయ‌కుడు కాసు మ‌హేష్‌రెడ్డి. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని గ‌నుల విష‌యాన్ని ప్రజ‌ల్లోకి లోతుగా తీసుకువెళ్లారు. దీనికి తోడు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఒక పార్టీ గుర‌జాల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి సీటు ఇవ్వడంతో ఈ వ‌ర్గం నేత‌లు అంతా క‌ట్టక‌ట్టుకుని కాసు మ‌హేష్‌రెడ్డిని గెలిపించారు.

మంచి మార్కులు పడుతున్నాయి…

ఫ‌లితంగా గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇదిలావుంటే, గెలిచిన కాసు మ‌హేష్‌రెడ్డి వైసీపీని మ‌రింత స్ట్రాంగ్ చేసుకునేందుకు త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ప్రజ‌ల‌కు చేరువ అవుతున్నారు. పైన చెప్పుకొన్నట్టు.. ఇక్కడి ప్ర‌జ‌ల‌కు ఎవ‌రూ శాశ్వతం కాద‌నుకునే నానుడిని తుడిచి పెట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కొన్ని ద‌శాబ్దాలుగా స‌మ‌స్యల‌తో అల్లాడుతున్న ప్రజ‌ల‌కు వారి స‌మ‌స్యల‌ను తీర్చే ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. మండ‌లాల వారీగా అభివృద్ధిని వికేంద్రీక‌రించి స్వయంగా త‌న ప‌ర్యవేక్షణ‌లోనే కార్యక్రమాలు చేప‌డుతున్నారు. దీంతో గ్రామాభ్యుదం పెరుగుతోంద‌నే టాక్ వ‌స్తోంది. ఇది ప్రజ‌ల్లో శాశ్వతంగా కాసుకు మంచి మార్కులు వేసేలా ఉంద‌నే నివేదిక‌లు కూడా వ‌స్తున్నాయి.

తొలి స్థానంలో కాసు….

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మెడిక‌ల్ కాలేజ్‌తో పాటు ఈ యేడాది కాలంలో గుర‌జాల‌, దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయతీల ఏర్పాటుతో కాసు మహేష్ రెడ్డి ఇమేజ్ అమాతం పెరిగింది. ఇటీవ‌ల జ‌గ‌న్ ఏడాది పూర్తి కావస్తున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టారు. ఎవ‌రు ఎక్కువ సమ‌యం నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటున్నారు? ఎవ‌రు ప్రజ‌ల‌తో క‌లిసిపోతున్నారు?ఎవ‌రు ప్రజ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు? ఎవ‌రు ప్రభుత్వ పథ‌కాల‌ను, న‌వ‌ర‌త్నాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్తున్నారు? అనే విష‌యాల‌ను స్పృశించిన‌ప్పుడు గుంటూరు కు సంబంధించి కాసు మ‌హేష్ రెడ్డి తొలిస్థానంలో నిలిచిన‌ట్టు తెలిసింది.

స్థానిక సంస్థల్లోనూ…

అంతేకాదు, వాస్తవానికి గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ర‌గ‌డ ఉంది. ఆధిప‌త్య పోరు ఉంది. అయితే, వీటికి దూరంగా కాసు మ‌హేష్ రెడ్డి త‌న ప‌నేదో తాను చేసుకుని ముందుకు సాగుతుండ‌డం, అంద‌రినీ క‌లుపుకొని పోతుండ‌డం కూడా రాజ‌కీయంగా ఆయ‌నకు మంచి మార్కులు ప‌డేలా చేసింద‌ని చెబుతున్నారు. ఏద‌మైనా మూడు ద‌శాబ్దాల య‌ర‌ప‌తినేని కంచుకోట కాస్తా కాసు మ‌హేష్ రెడ్డి దెబ్బతో ఊగిస‌లాట‌లో ఉంద‌న్నది మాత్రం నిజం. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయ‌కుండా చేతులెత్తేసిన వైన‌మే ఇక్కడ య‌ర‌ప‌తినేని గ్రిప్ త‌గ్గింద‌నేందుకు నిద‌ర్శనం.

Tags:    

Similar News