ఆఖరి అస్త్రం….?

కర్ణాటక రాజకీయంలో పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మాజీ [more]

Update: 2019-07-17 17:30 GMT

కర్ణాటక రాజకీయంలో పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు. సుప్రీంకోర్టు తీర్పును ఎవరికి వారే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య స్పీకర్ రమేష్ కుమార్ ను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. బలపరీక్ష పూర్తయ్యే వరకూ రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు.ఈ విషయమే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

మానసికంగా సిద్ధమై…..

ఇక విశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ లో అంతర్మధనం ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్దమయిందనే చెప్పాలి. అయితే చివరి క్షణం వరకూ కుమారస్వామి గెలుపు కోసం కృషి చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలందరూ ప్రయత్నిస్తున్నారు. రేపు ఉదయం కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొన బోతున్నారు. ఈ విశ్వాస పరీక్షకు హాజరుకావాల్సిందిగా పార్టీ సభ్యులందరికీ విప్ చేయనున్నారు.

బలం చూస్తే….

కాంగ్రెస్ పార్టీకి శానసనభలో 80 మంది శానసనభ్యులున్నారు. వారిలో 13 మంది పార్టీని వీడటంతో ఇక 67 మంది మాత్రమే మిగిలారు. అలాగే జనతాదళ్ ఎస్ లోనూ 37 మంది శాసనసభ్యులుంటే ముగ్గురు శాసనసభ్యులు ఫిరాయించారు. దీంతో జనతాదళ్ ఎస్ సభ్యుల సంఖ్య 34 కు చేరింది. ఈ బలంలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమేనన్నది సిద్దరామయ్య బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.

విప్ జారీ చేసి….

అందుకోసమే ముఖ్యమంత్రి కుమారస్వామి ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్ష కు అందరూ విధిగా హాజరుకావాలని కాంగ్రెస్, జేడీఎస్ లు తమ సభ్యులకు విప్ జారీ చేయనున్నాయి. విప్ జారి చేసిన తర్వాత సభకు హాజరుకాకుంటే వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది. వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగిస్తామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ హెచ్చరించారు. కానీ ఈ వార్నింగ్ లకు అసంతృప్త ఎమ్మెల్యేలు బెదిరిపోతారా? అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటికే వారు మానసికంగా పార్టీకి దూరమయ్యారన్నది వాస్తవం.

Tags:    

Similar News