ఎట్లకేలకు గ్రీన్ సిగ్నల్…?

కర్ణాటక మంత్రి వర్గం విస్తరణ ముహూర్తం దాదాపుగా ఖరారయింది. ఈనెల 19వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గత [more]

Update: 2019-08-17 18:29 GMT

కర్ణాటక మంత్రి వర్గం విస్తరణ ముహూర్తం దాదాపుగా ఖరారయింది. ఈనెల 19వ తేదీన మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గత రెండు రోజులుగా యడ్యూరప్ప ఢిల్లీలో మకాం వేసి మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరిపారు. మంత్రివర్గం లేకుండా దాదాపు ఇరవై రోజులు గడిచిపోవడంతో పాలన గాడిన పడలేదని యడ్యూరప్ప అధిష్టానంతో చెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు సాయం అందించాలన్నది కూడా యడ్యూరప్ప పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

బ్యాక్ గ్రౌండ్ చూసిన తర్వాతే….

అయితే మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలిసింది. వీలయినంత తక్కువమందితో మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలని యడ్యూరప్ప కు కేంద్ర నాయకత్వం సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని యడ్యూరప్పకు అమిత్ షా సూచించారు. పార్టీకి కట్టుబడి ఉండటమే కాకుాండా, బ్యాక్ గ్రౌండ్ కూడా ముఖ్యమని యడ్యూరప్పకు అమిత్ షా కొంచెం కటువుగానే చెప్పినట్లు సమాచారం.

కీలకనేతలతో కూడా…

భారతీయ జనతా పార్టీతో అనుబంధంతో పాటు గతంలో అవినీతి కేసులు వంటివి లేకుండా ఉండటాన్ని కూడా ఈసారి మంత్రివర్గంలో చేర్చుకునేందుకు పరిగణనలోకి తీసుకోనున్నారు. యడ్యూరప్ప ఢిల్లీలో ఉండగానే బీజేపీ ముఖ్య నేతలు జగదీశ్ శెట్టర్, గోవింద కారజోళి, అశోక్ లతో కూడా అధిష్టానం పెద్దలు చర్చించారు. అమిత్ షా కూడా ఒక జాబితాను రూపొందించినట్లు చెబుతున్నారు. ఆదివారాని తుదిజాబితా ఖరారయ్యే అవకాశాలున్నాట్లు తెలుస్తోంది.

తొలి విస్తరణలో….

తొలి దఫా విస్తరణలో మొత్తం పదిహేను నుంచి 20 మంది వరకూ చోటు ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీరిలో లింగాయత్ లను అత్యథికంగా ఐదుగురిని, ఒక్కలిగలను నలుగురిని, ఎస్సీ ముగ్గురు, ఎస్టీ ముగ్గురు, బిల్లవ, కురుబ, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఆర్ఎస్ఎస్ సిఫార్సుల మేరకు మరో ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద సోమవారం మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News