ఈయనకు ఆయన మీద కోపం ఎందుకో?

అనంత‌పురం జిల్లా అధికార పార్టీలో నాయ‌కుల ఆధిప‌త్య ధోర‌ణి నానాటికీ రూటు మారుతోంది. ఒక‌రి పై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీలు, [more]

Update: 2020-11-15 03:30 GMT

అనంత‌పురం జిల్లా అధికార పార్టీలో నాయ‌కుల ఆధిప‌త్య ధోర‌ణి నానాటికీ రూటు మారుతోంది. ఒక‌రి పై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ధ్య దూకుడు పెరుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటున్నారు. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఒక‌రు వేలు పెడుతున్నారు. దీంతో రాజ‌కీయాలు నానాటికీ హీటెక్కాయి. ఇప్పటికే అనంత‌పురం అర్బన్‌, హిందూపురం, క‌ళ్యాణ‌దుర్గం, పెనుగొండ‌లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్యమేలుతుండ‌గా ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య వార్ స్టార్ అయ్యింది.

జోక్యం ఎందుకంటూ….?

రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ త‌లారి రంగ‌య్య దూకుడు పెంచారంటూ విరుచుకుప‌డుతున్నారు. అనంత‌పురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రంగ‌య్య విజ‌యం సాధించారు. వ్యక్తిగ‌తంగా ఆయ‌నపై ఎలాంటి వివాదాలు లేక‌పోయినా ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదం అవుతున్నారు. త‌న‌కు సంబంధం లేని విషయాల్లోనూ ఆయ‌న జోక్యం పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తుంది.

అధికారులతో సంబంధాలు…..

ఇక్కడ సీనియ‌ర్ నాయ‌కుడు కాపు రామ‌చంద్రారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే.. రాయ‌దుర్గంపై రంగ‌య్య ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంద‌నేది కాపు ఆరోప‌ణ‌. ప్రతి విష‌యానికీ.. రంగ‌య్య జోక్యం చేసుకుంటున్నార‌ని, అధికారులు సైతం త‌న మాట విన‌డం లేద‌ని కాపు రామ‌చంద్రారెడ్డి తీవ్రంగా ర‌గిలిపోతున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఆయ‌న భ‌రించినా.. ఇప్పుడు మాత్రం బ‌య‌ట ప‌డిపోయారు. కాపు ఆవేద‌న‌కు మ‌రో కార‌ణం ఉంది. రంగ‌య్య గ‌తంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారిగా సుదీర్ఘకాలం ప‌నిచేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ‌తో పాటు జిల్లాలో ఉన్న అధికారులంద‌రిపై ఆయ‌న‌కు ప‌ట్టుంది. దీంతో ఉన్నతాధికారులు అంద‌రూ రంగ‌య్య మాట కాద‌నే ప‌రిస్థితి లేదు.

ఇసుక విషయంలో…..

ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా వేదావతి న‌ది నుంచి తరలించి నిల్వకేంద్రాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి ఇసుకను నిల్వకేంద్రం నుంచి తరలిస్తున్నారు. అయితే, ఈ కేంద్రంపై రంగ‌య్య పెత్తనం చేస్తున్నార‌ని కాపు రామ‌చంద్రారెడ్డి ఆరోప‌ణ‌. అధికారులు త‌న క‌నుస‌న్నల్లో ఉండేలా.. తాను చెప్పింది వినేలా.. ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఫ‌లితంగా స్థానిక ఎమ్మెల్యే కాపు త‌న వారికి కూడా ఇసుక‌ను ఇప్పించుకోలేని ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదంతా కూడా రంగ‌య్య వ్య‌వ‌హార‌మేన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గ వ్య‌వ‌హారాల్లో రంగ‌య్య పెత్త‌నం ఏంట‌నేది కాపు ఆరోప‌ణ‌.
ఎంపీ టార్గెట్ గా……
ముందుగా ఇసుక‌తో ప్రారంభ‌మైన ఈ ఇద్దరు నేత‌ల ఆధిప‌త్య పోరులో చివ‌ర‌కు కొంద‌రు స్థానిక నాయ‌కులు క్యాస్ట్ ఈక్వేష‌న్ నేప‌థ్యంలో రంగ‌య్యకు స‌పోర్ట్ చేయ‌డంతో ఇది గ్రూపుల గోల‌గా మారింది. దీంతో రంగ‌య్యపై కాపు రామ‌చంద్రారెడ్డి రెచ్చిపోతున్నారు. ఎంపీ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు. దీంతో రాయ‌దుర్గం రాజ‌కీయం వేడెక్కింది. ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News