జగన్ ను పవన్ అలా దెబ్బకొట్టనున్నారా?

ఏపీలో ప్రస్తుతం జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు కావ‌చ్చు… తాజా స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫలితా స‌ర‌ళీ కావొచ్చు.. నిశితంగా గ‌మ‌నిస్తే పై టైటిల్ అక్షరాలా నిజ‌మేనా ? [more]

Update: 2021-03-01 14:30 GMT

ఏపీలో ప్రస్తుతం జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు కావ‌చ్చు… తాజా స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫలితా స‌ర‌ళీ కావొచ్చు.. నిశితంగా గ‌మ‌నిస్తే పై టైటిల్ అక్షరాలా నిజ‌మేనా ? అనిపిస్తుంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. అటు విశాఖ జిల్లాల్లో జ‌న‌సేన గెలుచుకున్న, గ‌ట్టి పోటీ ఇచ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పై టైటిల్‌పై అనేక సందేహాల‌కు తావిచ్చే ఫ‌లితాలే వ‌చ్చాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఔన‌న్నా… కాద‌న్నా ఆయ‌న కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నార‌న్న ప్రచారం అయితే ఎక్కువుగా జ‌రుగుతోంది. జ‌గ‌న్ టార్గెట్ చేస్తున్నారంటూ ప్రచారం జ‌రుగుతోన్న వారిలో ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం తొలి ప్లేస్‌లో ఉండ‌గా… ఆ త‌ర్వాత కాపులు కూడా ఉన్నారంటూ ప్రచారం అయితే జ‌రుగుతోంది.

కాపులు ఎక్కువగా ఉన్న చోట….

తాజాగా గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో కాపులు ఎక్కువుగా ఉన్న చోట్ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎక్కువ పంచాయ‌తీలు గెలుచుకుంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక‌త‌తో ఉన్న కాపుల్లో చాలా మంది… ముఖ్యంగా కాపు యువ‌త జ‌నసేన వైపే ఎక్కువుగా మొగ్గు చూపుతోన్న ప‌రిస్థితి. న‌ర‌సాపురం, పాల‌కొల్లు, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఓట్లేసేందుకు ఇష్టప‌డ‌ని వాళ్లంతా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా జ‌న‌సేన వైపే మొగ్గు చూపారు. అందుకే ఇక్కడే జ‌న‌సేన ఎక్కువ పంచాయ‌తీలు గెలుచు కోవ‌డంతో పాటు చాలా చోట్ల గ‌ట్టి పోటీ ఇచ్చింది.

చివరకు పాలకొల్లులోనూ…..

చివ‌ర‌కు పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో సైతం జ‌నసేన వైసీపీని ఢీకొట్టి పంచాయ‌తీల్లో పాగా వేసింది. కాపుల్లో కూడా చాలా మంది కొన్ని స‌మీక‌ర‌ణ‌ల్లో టీడీపీ క‌న్నా జ‌గ‌నే ఎక్కువ టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. ఇది గ్రౌండ్ లెవ‌ల్లో కరెక్ట్‌గా తెలిసిపోతోంది. ఇక వైసీపీ అధిష్టానం సైతం కాపుల డామినేష‌న్ ఉన్న ప్రాంతాల్లో కూడా బీసీల‌కు ప‌దే ప‌దే ప్రయార్టీ ఇస్తుంద‌న్న గుస్సా కూడా కాపుల్లో ఉన్నట్టే క‌నిపిస్తోంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్తో కూస్తో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో కూడా కాపులు టీడీపీ కంటే జ‌న‌సేన‌నే ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.

టీడీపీకీ కష్టమే….?

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పోలిస్తే… ఇప్పుడు జ‌న‌సేన చాలా వీక్ అయ్యింద‌న్న అంచ‌నాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్నటైంలోనే జ‌న‌సేన స‌త్తా చాట‌డం ఆశ్చర్యంగా మారింది. ఏదేమైనా కాపులు బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి జ‌న‌సేన ప్రధాన పోటీగా ఎదిగే అవ‌కాశాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో జ‌న‌సేన స్ట్రాంగ్ అవుతోన్న ప‌రిస్థితి ఉండ‌డంతో టీడీపీ చాలా చోట్ల… ముఖ్యంగా కాపులు బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో చెల్లా చెదురు అయ్యే రోజులు ద‌గ్గర్లోనే క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News