Andhra : కాపులను ముంచిందే మెగా ఫ్యామిలీ కాదంటారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గం నమ్ముతుందా? ఆయనను నమ్ముకుని మరోసారి ఎన్నికల గోదాలోకి దిగేవారు ఎంతమంది? అన్నది ప్రశ్నగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-10-25 15:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గం నమ్ముతుందా? ఆయనను నమ్ముకుని మరోసారి ఎన్నికల గోదాలోకి దిగేవారు ఎంతమంది? అన్నది ప్రశ్నగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. గెలుపోటములను శాసించే పరిస్థిితి అనేక నియోజకవర్గాల్లో ఉంది. కాపులు అధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు. ముఖ్యమైన పదవులు తప్ప ముఖ్యమంత్రి పదవి మాత్రం వారికి అందడం లేదు.

ప్రజారాజ్యం పార్టీతో…

ఈ పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి పెట్టడంతో వారిలో ఆశలు రేగాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కాపు సామాజికవర్గం శక్తివంచన లేకుండా పనిచేసింది. కార్యకర్తలను పక్కన పెడితే అనేక మంది నేతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఆ ఎన్నికలలో పార్టీని గెలిపించేందుకు కోట్లకు కోట్లు వెచ్చించి దివాలా తీసిన వాళ్లు అనేక మంది ఉన్నారు. పార్టీ టిక్కెట్లు రాక అనేక మంది రాజకీయాలకు కూడా దూరమయిన పరిస్థితి.

ఏ రకంగా ఉపయోగం…?

అనంతరం ప్రజారాజ్యాన్ని కొనసాగించకుండా కాంగ్రెస్ లో కలిపేయడంతో మెగా ఫ్యామిలీపై కాపు సామాజికవర్గంలో ఒక మచ్చ ఏర్పడింది. మెగా ఫ్యామిలీని వాళ్లు ఓన్ చేసుకోలేకపోతున్నారు. సినీ ప్రపంచంలో విహరిస్తూ వారు తమకు ఏమాత్రం ఉపయోగపడరని కాపులు ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం వంటి నేతల మాటలకు మినహా వారు ఎవరికీ విలువ ఇవ్వని పరిస్థిితి అన్నది అందరికీ తెలిసిందే.

జనసేనను సయితం….

వంగవీటి రాధా మాటలను కూడా వారు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి కూడ అంతే. గత ఎన్నికల్లోనూ అనేకమంది జనసేన జెండా పట్టుకుని ఆర్థికంగా నష్టపోయారు. మరోసారి దివాలా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఏడాదికో పార్టీతో పొత్తు పెట్టుకునే పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గం ఏ మేరకు విశ్వసిస్తుంది? ఆయన కు అండగా ఎంతమాత్రం నిలబడుతుందన్నవన్నీ శేష ప్రశ్నలే.

Tags:    

Similar News