యాక్టివ్ అవ్వడానికి కారణం అదేనా?

చాలా రోజుల తర్వాత మళ్లీ కన్పించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తర్వాత దూకుడుగా ఉన్న ఆ నేత రెండేళ్లుగా మౌనంగా ఉండి ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ [more]

Update: 2020-08-31 09:30 GMT

చాలా రోజుల తర్వాత మళ్లీ కన్పించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆ తర్వాత దూకుడుగా ఉన్న ఆ నేత రెండేళ్లుగా మౌనంగా ఉండి ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ లోకి వద్దామని ప్రయత్నిస్తున్నారు. ఆయన మాజీ శాసనమండలి సభ్యుడు కపిలవాయి దిలీప్ కుమార్. కపిలవవాయి దిలీప్ కుమార్ ఉమా మాధవరెడ్డి వద్ద పీఎస్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెంత చేరారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

కేసీఆర్ తో పొసగక…..

ఆ తర్వాత కేసీఆర్ తో పొసగక బయటకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ప్రస్తుతం దిలీప్ కుమార్ ఉన్నారు. దిలీప్ కుమార్ గతంలో రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా ఆయన రాజకీయంగా దూరంగా ఉన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లోనూ దిలీప్ కుమార్ యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు అందరూ భావించారు.

మళ్లీ యాక్టివ్ అవుతూ…

కానీ ప్రస్తుతం మళ్లీ దిలీప్ కుమార్ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయిందంటూ ఒక సెమినార్ ను దిలీప్ కుమార్ నిర్వహించారు. ప్రభుత్వం పూర్తి విఫలమయిందని ఆరోపిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తానంటూ బయలుదేరారు. ఇప్పుడు తెలంగాణలో సాధారణ ఎన్నికలు లేవు. మరో మూడేళ్ల సమయం ఉంది. మరి దిలీప్ కుమార్ ఎందుకు యాక్టివ్ అయ్యారనడానికి సమాధానం ఉంది.

ఆ ఎన్నికలే కారణమా…?

అందుకు ప్రధాన కారణం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గతంలో వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి దిలీప్ కుమార్ విజయం సాధించారు. త్వరలో జరగనున్న ఈ స్థానంలో తిరిగి పోటీ చేయాలని దిలీప్ కుమార్ భావిస్తున్నట్లుంది. అందుకే మళ్లీ ఆయన యాక్టివ్ అయ్యారంటున్నారు. అందుకే అన్ని పక్షాలను కూడగట్టి మద్దతు సాధించేందుకు కేసీఆర్ కు వ్యతిరేకంగా సదస్సును ఏర్పాటు చేశారంటున్నారు. మరి దిలీప్ కుమార్ ఆశలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News