కామ్రేడ్లకు కాలం కలసి రావడం లేదా?

కమ్యునిస్టులకు కాలం చెల్లినట్లుగానే కనిపిస్తుంది. పాతకాలపు వాసనలతో నెట్టుకొస్తున్న వామపక్ష పార్టీలను ప్రజలు దూరం పెట్టారు. ఇక ఆ పార్టీ నేతలు కూడా ఒక్కొరొక్కరుగా దూరమవుతున్నారు. మారుతున్న [more]

Update: 2021-02-28 18:29 GMT

కమ్యునిస్టులకు కాలం చెల్లినట్లుగానే కనిపిస్తుంది. పాతకాలపు వాసనలతో నెట్టుకొస్తున్న వామపక్ష పార్టీలను ప్రజలు దూరం పెట్టారు. ఇక ఆ పార్టీ నేతలు కూడా ఒక్కొరొక్కరుగా దూరమవుతున్నారు. మారుతున్న కాలానానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పాత సంప్రదాయ పద్ధతులను వీడకపోవడంతో వామపక్ష పార్టీలు క్రమంగా తమ ప్రాభవాన్ని దేశంలో కోల్పోతున్నాయి. కన్హయ్య కుమార్ సయితం పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది.

చిన్న వయసులోనే….

కన్హయ్య కుమార్ అతి చిన్న వయసులో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందగలిగారు. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ఆయన పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరు మారుమోగింది. ఇక దేశంలో కన్హయ్య కుమార్ పర్యటన మామూలుగా లేదు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బీజేపీపై మీద ఒంటికాలు మీద లేచే కన్హయ్య కుమార్ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీకి దగ్గరవుతుండటం చర్చనీయాంశమైంది.

పోటీ చేసి ఓటమి పాలయి….

బెగూసెలాయ్ నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన కన్హయ్య కుమార్ ఓటమి పాలయ్యారు. అయితే ఆయన కొన్నాళ్ల క్రితం పార్టీ నేతలతో కొన్ని విషయాలపై వాదులాటకు దిగారని సమాచారం. పార్టీ లైన్ కు విరుద్దంగా మాట్లాడుతున్నారని కన్హయ్య కుమార్ ను సీపీఐ నేతలు తప్పు పట్టారు. అంతేకాదు కొన్నాళ్ల క్రితం కన్హయ్య కుమార్ పై హైదరాబద్ లో జరిగిన సమావేశంలో వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు.

జేడీయూలో చేరతారని…..

అయితే కన్హయ్య కుమార్ ఇటీవల బీహార్ లో మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి అశోక్ చౌదరితో భేటీ అయినప్పటి నుంచి ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే మంత్రితో భేటీ పార్టీ మారడానికేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే దీనిపై ఎవరూ మాట్లాడటం లేదు. అయితే కన్హయ్య కుమార్ పార్టీ మారినా, లేకపోయినా కమ్యునిస్టులకు మాత్రం కన్హయ్య కుమార్ ఒక గుణపాఠంగా చెప్పి తీరాలి.

Tags:    

Similar News