కన్నాకు ఆయనపై ఆగ్రహానికి కారణం?

కన్నా లక్ష్మీనారాయణ కామ్ అయిపోయారు. పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాటం మానేశారు. సోము వీర్రాజు పార్టీ బాధ్యతలను తీసుకుంటున్న సమయంలో హాజరైన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత [more]

Update: 2020-09-09 03:30 GMT

కన్నా లక్ష్మీనారాయణ కామ్ అయిపోయారు. పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాటం మానేశారు. సోము వీర్రాజు పార్టీ బాధ్యతలను తీసుకుంటున్న సమయంలో హాజరైన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత కన్పించడమే మానేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఫుల్లు యాక్టివ్ గా ఉన్నారు. దీక్షలు, ధర్నాలతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం పై నిత్యం విరుచుకుపడేవారు.

అప్పటి నుంచే మౌనం…..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకున్న నాటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి రెండు కారణాలున్నాయంటున్నారు. ఒకటి తనకు బీజేపీ అధ్యక్ష్య పదవిని మరోసారి రెన్యువల్ చేయాలని కేంద్ర నాయకత్వాన్ని కోరినా ఫలితం కన్పించక పోవడం. కేంద్ర స్థాయిలో ఏదో పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అది కూడా కనుచూపు మేరలో కన్పించకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా నిరాశలో మునిగిపోయారంటున్నారు.

వైసీపీలోకి వెళ్లినా…..

ఇటీవల తనను కలసిన బీజేపీ మిత్రుడితోనూ తాను అనవసరంగా బీజేపీలోకి వచ్చానని, వైసీపీలోకి వెళ్లినా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండేవాడినని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడం ఆయన నైరాశ్యానికి అద్దం పడుతుంది. మరోవైపు సోము వీర్రాజుతో ప్రత్యేకించి ఎటువంటి విభేదాలు లేకపోయినా, అమిత్ షా మీదనే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలోకి వెళ్లే కన్నా లక్ష్మీనారాయణను ఫోన్ చేసి మరీ ఆపింది అమిత్ షానే.

అమిత్ షాను కలిసేందుకు…..

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదవి పోక ముందు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీనికి తోడు ఢిల్లీలో చేరిన కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు అభిప్రాయాన్ని అమిత్ షాకు కలిగించారని, దీనిపై వివరణ ఇవ్వాలనుకున్నా అమిత్ షా సమయం ఇవ్వలేదని కన్నా లక్ష్మీనారాయణ ఫీలయిపోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉండి ఏమీ కాని నేతగా మిగిలిపోవాల్సిందే.

Tags:    

Similar News