కన్నాకు వ్యతిరేకంగా బలమైన లాబీయింగ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వర్గాలుగా విడిపోయి భిన్న వాదనలను విన్పిస్తున్నారు. ఒకే తాటి మీద ఉండాల్సిన నేతలు విడిపోయినట్లే కనపడుతోంది. ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్న నేతలు పదవుల కోసమే [more]

Update: 2020-07-28 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వర్గాలుగా విడిపోయి భిన్న వాదనలను విన్పిస్తున్నారు. ఒకే తాటి మీద ఉండాల్సిన నేతలు విడిపోయినట్లే కనపడుతోంది. ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్న నేతలు పదవుల కోసమే గొంతు పెద్దది చేస్తున్నారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. అయితే పొరుగున ఉన్న తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించిన పార్టీ హైకమాండ్ ఏపీి విషయానికి వచ్చే సరికి ఈ అంశాన్ని కొంత కాలం పక్కన పెట్టింది.

రెండేళ్లు పూర్తి కావడంతో….

ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారా‍యణ ఉన్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు పూర్తయింది. అయితే కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో పదవిని దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ పై కూడా ఏపీ నేతల నుంచి వత్తిడి పెరిగింది. దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందరి అభప్రాయాలను తీసుకోవాలని భావించింది.

గ్యాప్ పెరగడంతో…..

ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణకు, మరికొందరు నేతలకు మధ్య గ్యాప్ పెరిగిందంటున్నారు. బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత సరైన కార్యక్రమాలు కూడా కన్నా లక్ష్మీనారాయణ చేపట్టడం లేదని ఇప్పటికే కొందరు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. కేవలం అధికార పార్టీని మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తున్నారని, టీడీపీతో సఖ్యతగా ఉన్నట్లు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది.

హైకమాండ్ పై వత్తిడి…..

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కొందరు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణను పదవి నుంచి తొలగించాలని వత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ కూడా కన్నా లక్ష్మీనారాయణ పనితీరు పట్ల సంతృప్తికరంగా లేరన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఒకవర్గం మాత్రం ఢిల్లీ స్థాయిలో బలంగా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ను పదవి నుంచి తప్పించారంటున్నారు.

Tags:    

Similar News