కన్నాకు పెద్దల క్లాస్ అందుకేనా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అధిష్టానం అక్షింతలు వేసిందా? రాజధాని విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిందా? అంటే అవుననే అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో [more]

Update: 2020-07-20 11:00 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అధిష్టానం అక్షింతలు వేసిందా? రాజధాని విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిందా? అంటే అవుననే అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో పెద్దలు కన్నా లక్ష్మీనారాయణకు క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకగా గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడంపార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర నాయకత్వం మాత్రం…..

అమరావతిని మూడు రాజధానులుగా చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని తొలి నుంచి కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే కేంద్రంలోని పెద్దలుమాత్రం రాజధాని ఎక్కడుండాలన్నది ఆ రాష‌్ట్ర ప్రభుత్వంలోని అంశమని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. ఇటీవల రాజధాని అమరావతి ప్రాంత ప్రజల ఆందోళన రెండు వందల కు చేరిన రోజు కూడా పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

గవర్నర్ కు లేఖ రాయడంతో…..

కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగంచాలని, ఇది పార్టీ నిర్ణయమని చెబుతూ వస్తున్నారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందకపోవడం, గడువుముగియడంతో ఆ బిల్లును ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని, న్యాయ సలహాలు తీసుకోవాలని, రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖరాశారు.

కన్నా వర్గం మాత్రం…..

గతంలో బీజేపీ, జనసేన పొత్తు ఏర్పడినప్పుడు కూడా రాజధానిని అమరావతి నుంచి తరలింపునకు వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ చేస్తామని అప్పట్లో ప్రకటించినా అది చేయలేదు. దీనికి కారణం ఢిల్లీ ఎన్నికలని అప్పట్లో కుంటిసాకులు చెప్పినా పార్టీ అధిష్టానం నోచెప్పినందునే ఆ కార్యక్రమం వాయిదా పడిందన్న టాక్ ఉంది. ఇప్పుడు గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖపై కూడా అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది అంతా ప్రచారమేనని కన్నా లక్ష్మీనారాయణ వర్గం కొట్టిపారేస్తుంది.

Tags:    

Similar News