kanna lakshminarayana : కన్నాను నిలువరించేదెవరు?

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆయన రాజకీయ భవితవ్యం ఎటువైపు సాగుతుందన్న చర్చ జోరుగా నడుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు [more]

Update: 2021-10-13 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఆయన రాజకీయ భవితవ్యం ఎటువైపు సాగుతుందన్న చర్చ జోరుగా నడుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. గుంటూరు జిల్లాలో ఆయనకు తిరుగు లేకుండా చేసుకున్నారు. ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లోనే ఉన్నా ఆయనను నిలువరించడంలో కన్నా సక్సెస్ కాగలిగారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ ఫేట్ రాజకీయంగా మారిందనే చెప్పాలి.

బీజేపీలో చేరినా….

వైసీపీలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవిని ఆశించి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఎటు కాకుండా పోయారు. కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీలో దారులు మూసుకుపోయాయి. ఇటు టీడీపీలో చేరాలన్నా ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు అక్కడ కర్చీఫ్ వేసి కూర్చుని ఉన్నారు. బీజేపీకి ఏపీలో భవిష్యత్ లేదు. జనసేనతో కలసినా కనీసం కింగ్ మేకర్ గా మారుతుందన్న ఆశలు కూడా అడుగంటుతున్నాయి. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

పదవులు దక్కవని తేలడంతో….

ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ జరుగుతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కన్నా పెద్దగా యాక్టివ్ గా లేరు. తనకు బీజేపీ పెద్దలు ఏదో ఒక పదవిని ఇస్తారన్న ఆశతో నిన్న మొన్నటి వరకూ ఉన్నారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనకు ఛాన్స్ రాదన్నది ఆయన డిసైడ్ అయ్యారు. బీజేపీలోనే కొనసాగితే రాజకీయంగా ఇబ్బంది పడతామని కన్నా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

టీడీపీలో చేరితే….

అయితే ఏ పార్టీలో చేరాలన్నా తనకు లభించే ప్రాధాన్యతపైనే ఆయన అడుగులు పడనున్నాయి. ఆయనకు టీడీపీలో చేరాలన్న ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కన్నా వస్తారంటే చంద్రబాబు పార్టీలో చేర్చుకునేందుకు రెడీ గా ఉన్నారు. ఆయనకు గుంటూరులో ఏదో ఒక స్థానం కూడా కేటాయిస్తారు. సామాజికవర్గం కారణంగా రాయపాటి కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశముంది. రాజధాని ప్రభావంతో టీడీపీ గుర్తు మీద గెలవడం సులువే. అందుకే కన్నా లక్ష్మీనారాయణ పసుపు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. మరి కొద్దిరోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News