క‌న్నాపై షాకింగ్ న్యూస్.. టీడీపీలోకొస్తే ఆ సీటిస్తారా?

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత‌. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఓట‌మి లేకుండా ఎమ్మెల్యే.. ప‌లువురు ముఖ్యమంత్రుల ద‌గ్గ‌ర మంత్రి.. కాపు [more]

Update: 2020-12-10 15:30 GMT

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత‌. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఓట‌మి లేకుండా ఎమ్మెల్యే.. ప‌లువురు ముఖ్యమంత్రుల ద‌గ్గ‌ర మంత్రి.. కాపు సామాజిక వ‌ర్గంలో కీల‌క నేత‌.. పీసీసీ అధ్యక్షుడు ఇలా ఎన్నో ప‌ద‌వులు త‌న‌కు అలంకారంగా మార్చుకున్న ఆయ‌న 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తొలిసారి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లాల‌నుకున్నారు.. అన్ని ప్రయ‌త్నాలు చేసుకున్నా చివ‌ర్లో రాత్రికి రాత్రే ప్లాన్ మార్చుకుని బీజేపీలోకి జంప్ చేయ‌డంతో పాటు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షుడు అయ్యారు. ఆ పార్టీ నుంచి న‌ర‌సారావుపేట ఎంపీగా పోటీ చేసి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఓడిపోయారు. బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోయినా క‌న్నాను ఆ పార్టీ అధిష్టానం పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పించేసింది.

గౌరవ మర్యాదలే లేకుండా…..

పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పించాక బీజేపీలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. 1988 నుంచి నేటి వ‌ర‌కు క‌న్నా రాజ‌కీయానికి ఓ క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు క‌న్నాకు రాజ‌కీయంగా గౌర‌వ మ‌ర్యాద‌లే లేకుండా పోయాయి. క‌న్నాకు బీజేపీలో విలువ‌లేదు. వైసీపీలోకి ఆయ‌న్ను తీసుకునే ప‌రిస్థితి లేదు.. వెళ్లినా అక్కడ కూడా ఆట‌లో అర‌టిపండే. ఎన్నిక‌ల‌కు ముందు క‌న్నా వైసీపీలోకి వెళ్లి ఉంటే సీనియ‌ర్‌గా ఆయ‌న గౌర‌వం ఆయ‌న‌కు ఉండేది. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీయే. క‌న్నా కొత్త రాజ‌కీయ అడుగులు టీడీపీ వైపు ఉన్నట్టు గుంటూరు జిల్లాలో క్రేజీ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తానే కోరినట్లు….

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణయే తాను టీడీపీలోకి వ‌స్తాన‌ని.. స‌త్తెన‌ప‌ల్లి సీటుపై హామీ ఇవ్వాల‌ని టీడీపీ నేత‌ల‌ను కోరిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి క‌న్నా స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ సీటే కోరుతున్నా.. ఆయ‌న సీనియార్టీ నేప‌థ్యంలో ఆయ‌న త‌ర్వాత అయినా మంత్రి ప‌ద‌వి కోరే అవ‌కాశాలున్నాయి. అయితే గుంటూరు టీడీపీలో త‌ల‌పండిన సీనియ‌ర్లకు క‌న్నాకు పాత గొడ‌వ‌లు చాలానే ఉన్నాయి. వీళ్లలో చాలా మంది క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు.

సీనియర్ నేతలతో….

త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న గుంటూరు టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌న గోడు వెళ్లబోసుకోవ‌డంతో పాటు టీడీపీలోకి వ‌చ్చే విష‌యాన్ని ప్రస్తావించార‌ట‌. ఈ క్రమంలోనే సత్తెన‌ప‌ల్లి సీటు విష‌యం ప్రస్తావ‌న‌కు కూడా వ‌చ్చిందంటున్నారు. స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీకి ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఎవ్వరూ లేరు. దివంగ‌త నేత కోడెల మ‌ర‌ణం త‌ర్వాత ఈ సీటు కోసం ఆయ‌న వార‌సుడు కోడెల శివ‌రాంతో పాటు మాజీ ఎంపీ రాయ‌పాటి త‌న‌యుడు రంగారావు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. వీరిద్దరి మ‌ధ్య పోరు నడుస్తుండ‌గా విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాను సైతం చంద్రబాబు స‌త్తెన‌ప‌ల్లికి పంపుతార‌న్న ప్రచారం కూడా జ‌రిగినా అది సెలెంట్ అయ్యింది.

ప్లస్ అవుతారని…..

ఇంత‌లోనే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలోకి అన్న వార్తలు గుంటూరు రాజ‌కీయాల‌ను కాక పుట్టించాయి. క‌న్నా టీడీపీకి ఖ‌చ్చితంగా ప్లస్ అవుతాడు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నేప‌థ్యంలో గుంటూరులో ఇప్పటికే టీడీపీ పుంజుకున్న ప‌రిస్థితి ఉంది. ఇలాంటి టైంలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి ప‌ట్టున్న నేత తోడైతే అది పార్టీకి ప్లస్సే. అలాగే క‌న్నాకు టీడీపీలో ఏ రేంజ్‌లో పున‌ర్వైభ‌వం వ‌స్తుందో ? చూడాలి. ప్రస్తుతానికి గుంటూరులో ఈ విష‌య‌మే ర‌హ‌స్యంగా చ‌ర్చకు వ‌స్తోంది.

Tags:    

Similar News