మరింత నష్టం జరగకముందే?

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా అనేక మంది నేతలు నష్టపోయారు. పార్టీలు మారిని కొందరికి కలిసి రాలేదు. వారిలో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2020-12-02 00:30 GMT

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా అనేక మంది నేతలు నష్టపోయారు. పార్టీలు మారిని కొందరికి కలిసి రాలేదు. వారిలో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా నష్టపోయారు. కొన్నాళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా అది ఆయనకు కష్టాన్ని మిగిల్చిందే తప్ప మరే రకంగా ఉపయోగపడలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.

కొన్నిరోజులుగా మౌనంగా……

కన్నా లక్ష్మీనారాయణ గత కొన్నాళ్ల నుంచి కామ్ గా ఉంటున్నారు. అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఆయన యాక్టివ్ గా లేరన్నది మాత్రం వాస్తవం. కన్నా లక్ష్మీనారాయణ పునరాలోచనలో పడ్డారన్న టాక్ నడుస్తుంది. తాను అధ్యక్షుడి గా ఉన్నప్పుడు అన్ని జిల్లాలను పర్యటించి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు వారిని కూడా పట్టించుకోవడం లేదంటున్నారు.

సోము వచ్చిన నాటి నుంచి….

నిజానికి కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి అవకాశం ఇవ్వాల్సి ఉన్నా అధినాయకత్వం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో సోము వీర్రాజు ను నియమించింది. అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. బీజేపీలోని ఒక వర్గం కన్నాను టార్గెట్ చేసిందంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలోనూ కన్నా లక్ష్మీనారాయణకు ఆహ్వానం అందలేదంటున్నారు.

పూర్తిగా పక్కన పెట్టి…..

అంతేకాదు సీనియర్ నేతగా, బలమైన కాపు సామాజికవర్గం నేత అయిన కన్నా లక్ష్మీనారాయణను తిరుపతి ఉప ఎన్నిక విష‍యంలో అసలు బీజేపీ నేతలు సంప్రదించలేదంటున్నారు. ఇందుకు కన్నా లక్ష్మీనారాయణ మనస్తాపం చెందారంటున్నారు. పార్టీలో ఉండటం కంటే బయటకు వెళ్లడమే బెటరని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అయితే తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన బీజేపీ పెద్దలకు తెలియజెప్పిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. మొత్తం మీద బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ రోజులు ఉండలేరనే అంటున్నారు.

Tags:    

Similar News