ఆ బడా నేతలు ఎవరు?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలుకుబడి ఎన్నికల ముందు కంటే ఇపుడే జోరు మీదున్నట్లుంది. ఎన్నికల వేళ, అంతకు ముందు పార్టీ అధినేతగా ఆయన ఉత్తరాంధ్ర [more]

Update: 2019-08-12 09:30 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలుకుబడి ఎన్నికల ముందు కంటే ఇపుడే జోరు మీదున్నట్లుంది. ఎన్నికల వేళ, అంతకు ముందు పార్టీ అధినేతగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తే పట్టించుకునే నాధుడే లేడు. రోడ్ షోలతో హడావుడి చేసినా పది మంది కార్యకరలు కూడా వెంట రావడం కష్టమైపోయింది. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారు. మూడు జిల్లాల్లో ఆయన పర్యటించి వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మీద విరుచుకుపడ్డారు. అవన్నీ అలా ఉంచితే గతంతో పోల్చితే కన్నా లక్ష్మీనారాయణకు ఇపుడు కొంచెం ఆదరణతో పాటు, కార్యకర్తల తాకిడి కూడా పెరిగింది. టీడీపీ, జనసేనల నుంచి ఇతర నాయకులు కన్నాను కలసి పార్టీలో చేరుతామని సందేశాలు పంపారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. తన హయాంలో బీజేపీ ఎక్కడికో వెళ్ళిపోతోందని భావిస్తున్న కన్నా ఆ ఆందంల్తో భారీ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఏపీలో బీజేపీకి తిరుగులేదని, అధికారానికి అంగుళం దూరంలో తాము ఉన్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు.

బడా నాయకులు …

ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన బడా నాయకులు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని ఉత్తరాంధ్ర పర్యటనలో కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దీనికి ఆయన ముహూర్తం కూడా నిర్ణయించారు. ఆగస్ట్ నెల చివరి వారంలో పెద్ద నాయకులే బీజేపీలో చేరుతారని బాము పేల్చారు. టీడీపీలో ఉన్న వారితో పాటు, అధికార వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ అనడం విశేషం. మరి ఎవరు ఆ నాయకులు అని అడిగితే మీరే చూస్తారు కదా అంటూ కన్నా తెలివైన సమాధానం చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ బలంగా ఉందని, మోడీ నాయకత్వం మీద క్రేజ్ ఉందని, దక్షిణాదిన కూడా బీజేపీ బలపడుతోందని, ఏపీలో వచ్చేది తామేనని అందరికీ తెలిసిపోయిందని కూడా కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అవన్నీ పక్కన పెడితే ఎవరా బడా నాయకులు అన్నది కన్నా చెప్పకపోవడంతో అందరిలోనూ టెన్షన్ పట్టుకుంది.

బాబుకు తలుపులు క్లోజ్…

ఇదిలా ఉండగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ, టీడీపీ దోస్తీ మళ్ళీ ఉండదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుకు ఎన్డీయే తలుపులు మూసేశారని ఆయన అంటున్నారు. చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ ఏపీలో అధికారంలోకి రావడం కష్టమని కూడా ఆయన తేల్చేస్తున్నారు. ఓ విధంగా టీడీపీ పని ఏపీలో అయిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ అనడం విశేషం. ఇక చంద్రబాబు ఏపీలో టీడీపీని కూడా నడపలేడని ఆయన చేస్తున్న కామెంట్స్ తో రాజకీయాల్లో కొత్త వేడిని పుట్టించారు. ఆ సంగతి తెలిసే టీడీపీ నుంచి అనేకమంది నాయకులు తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. మరో వైపు జగన్ పార్టీ మీద కూడా కన్నా లక్ష్మీనారాయణ బాణాలు వేశారు. ఏపీలో టీడీపీకి, వైసీపీకి తేడాయే లేదని ఆయన అన్నారు. రెండు పార్టీలూ దొందుకు దొందే అనేశారు. ఇవన్నీ బాగానే ఉన్నా వైసీపీ నుంచి కూడా బీజేపీలోకి నేతలు వస్తున్నారని కన్నా చెప్పడమే కొసమెరుపు. పదేళ్ల తరువాత ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి నేతలు ఎందుకు వస్తారు. ఈ లాజిక్ మరచి కన్నా చెబుతున్నారా లేక కొత్త సంబరంలో అలా మాట్లాడుతున్నారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఆగస్ట్ సంక్షోభం అంటేనీ టీడీపీ భయపడుతోంది. మరి ఇదే నేలలో బడా నాయకులు వచ్చి చేరుతారని కన్నా ప్రకటించడంతో పసుపు శిబిరం తెగ కలవరపడుతోంది.

Tags:    

Similar News