కన్నా అడుగులు అటువైపేనా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మనసు మారుతుందా? ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదవి నుంచి తప్పుకున్న నాటి [more]

Update: 2020-11-05 05:00 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మనసు మారుతుందా? ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదవి నుంచి తప్పుకున్న నాటి నుంచి పెద్దగా యాక్టివ్ గా లేరు. పైగా కొత్తగా వచ్చిన అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు మీద ఉన్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవారు. కానీ సోము వీర్రాజు టీడీపీని కూడా వదిలిపెట్టడం లేదు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ కు సోము వీర్రాజు విలువ లేకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

బీజేపీ అధ్యక్షుడిగా…..

కన్నా లక్ష్మీనారాయణ నిజానికి తొలుత వైసీపీలోకే వెళ్లాలనుకున్నారు. కానీ అమిత్ షా ఫోన్ చేసి మరీ బీజీపీ రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తానని చెప్పడంతో అప్పట్లో మనసు మార్చుకుని బీజేపీ కండువా కప్పేసుకున్నారు. రెండేళ్లకు పైగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటమి చూసింది. ఆయన స్వయంగా ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ కోసం ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్రమించారు.

ప్రాధాన్యత లేకపోవడంతో….

తాను రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి బీజేపీలోకి వచ్చినా తనకు సముచిత స్థానం, ప్రాధాన్యత దక్కడం లేదని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. తాను ఉన్నప్పుడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు కుదుర్చుకున్నానని కూడా కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. అలాంటి తనకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టడం పై ఆయన ఆవేదనతో ఉన్నారని తెలసిింది. భవిష్యత్ లో కూడా తనకు ప్రాధాన్యత దక్కదని ఆయన భావిస్తున్నారు.

వెయిట్ చేసి నిర్ణయం…..

వచ్చే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసమే ఆయన బీజేపీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరికపై కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆలోచన చేస్తున్నారని సమచారం. వైసీపీతో తనకు దూరం పెరగడడంతో మరో ఆప్షన్ తెలుగుదేశం పార్టీ మాత్రమే. అయితే మరికొంత కాలం వెయిట్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ యోచిస్తున్నట్లు తెలిసింది. అమరావతి అంశంతో గుంటూరు జిల్లాలో టీడీపీకి కొంత బలం పెరిగిందని భావిస్తున్న కన్నా ఆ వైపే అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News